Asianet News TeluguAsianet News Telugu

కార్తీకమాసంలో ఈ రోజు చాలా ప్రత్యేకం..

కార్తీక మాసంలోనే శివ కేశవులకు భేదం లేకుండా పూజించాలి. కాని ఈ రోజున ప్రత్యేకంగా సోమవారం శివునికి ప్రీతికరమైనది, ఏకాదశి రావడం విష్ణువుకు ప్రీతికరమైన రోజు. ఈ రోజున చేసే పూజలు జపాలు, హోమాలు, దానాలు అన్నీ కూడా మిగతా రోజుల్లో వచ్చిన పుణ్యం కంటే ఎక్కువ రెట్లు ఫలితాలనిస్తాయి.

karteeka masasm.. ekadasi somavaram special story
Author
Hyderabad, First Published Nov 19, 2018, 10:11 AM IST

కార్తీకమాసంలో సోమవారం ఏకాదశి రెండూ కలిసి రావడం విశేషంగా భావిస్తారు. కార్తీక మాసంలోనే శివ కేశవులకు భేదం లేకుండా పూజించాలి. కాని ఈ రోజున ప్రత్యేకంగా సోమవారం శివునికి ప్రీతికరమైనది, ఏకాదశి రావడం విష్ణువుకు ప్రీతికరమైన రోజు. ఈ రోజున చేసే పూజలు జపాలు, హోమాలు, దానాలు అన్నీ కూడా మిగతా రోజుల్లో వచ్చిన పుణ్యం కంటే ఎక్కువ రెట్లు ఫలితాలనిస్తాయి.

ఈరోజు ఏకాదశి విష్ణువుకు ప్రీతికరమైన రోజు. చాతుర్మాస్య దీక్ష అని ఆషాఢమాసంలో మొదలు పెట్టి ఈ ఏకాదశితో పూర్తిచేస్తారు. నాలుగు నెలల దీక్షను విరమిస్తారు. అన్ని ఏకాథులలోను ఆషాఢ శుద్ధ ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి చాలా పుణ్య దినం. ఈరోజు విశేషించి సోమవారం కూడా కలిసి రావడం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయనైకాదశి అని, ఈ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని పేరు. ఆషాఢ శుద్ధ ఏకాదశిరోజు విష్ణువు నిద్రకు ఉపక్రమించి, ఈరోజు నిద్రనుంచి మేల్కొంటాడు అని అర్థం. ఈరోజున విష్ణువుకు తులసి దళాలతో పూజించాలి. తులసి మాలలు విష్ణువుకు సమర్పించాలి. అవకాశం ఉన్నవారు అంటే దగ్గరలో నదులు కాని సముద్రాలు కాని ఉన్నవారు ఆ ప్రదేశాలకు వెళ్ళిస్నానాలు చేసి దీపారాధన చేయడం, ఉసిరి కాయలు దానం ఇవ్వడం మంచి ఫలితాలను ఇస్తుంది.

కార్తీక మాసంలో శివపూజకు శివాభిషేకానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. శివలింగాలలో చాలా రకాలుగా ఉంటాయి. ఏ రకమైన శివలింగాన్ని పూజిస్తే ఏ రకమైన ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం.

గంధలింగం : రెండు భాగాలు కస్తూరి, నాలుగు భాగాలు చందనం, మూడు భాగాలు కుంకుమ కలిపి గంధ లింగమును తయారు చేస్తారు. దీనిని పూజిస్తే శివసాయుజ్యం కలుగుతుంది.

పుష్పలింగం : నానా విధాలైన సువాసన గల పూలతో నిర్మించిన ప్ఫులింగాన్ని పూజించటం వలన రాజాధిపత్యం కలుగుతుంది.

గోమయ లింగం : స్వచ్ఛమైన తెల్లని ఆవు యొక్క పేడను తెచ్చి లింగం చేసి పూజించిన ఐశ్వర్యం కలుగుతుంది. పేడ నైలపైన పడకుండా పట్టుకుని ఉండాలి.

రజోమయ లింగం : పుప్పొడితో తయారు చేసిన లింగమును పూజించిన విద్యాధరత్వం సిద్ధిస్తుంది. అదీ కాక శివ సాయుజ్యం పొందుతారు.

యమగోధుమ లింగం : యమలు గోధుమలు, బియ్యపు పిండితో చేయబడిన శివలింగమును పూజించిన సకల సంపదలు కలుగుతాయి. పుత్ర సంతానం కావాలనుకునేవారు ఈ లింగానికి పూజలు చేయాలి.

తిలపిష్ట లింగం : నువ్వుల పిండితో లింగం చేసి పూజించిన అనుకున్న పనులు పూర్తి అయి అందులో కార్యజయం కలుగుతుంది.

లవణ లింగం : హరిదళం, త్రికటుకాలు మెత్తగా పొడి చేసిఉప్పుతో కలిపి లింగం చేసి పూజించిన అందరిపైన విజయం కలుగుతుంది.

ఈరోజున పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి శివ, విష్ణు ఆలయాలకు వెళ్లి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి. ఏకాదశి ఉపవాసం చేసేవారు ఈ రోజు ఉపవాసం ఉండి, ఎక్కువసేపు భగవంతుని దగ్గరగా గడపడానికి ప్రయత్నం చేయాలి.

ఇలా ఈరోజు శివకేశవులకు అభేధం లేదు అనే విషయాన్ని తెలుసుకుని ఇద్దరినీ పూజించి ఇద్దరి అనుభవానికి పాత్రులై అనుకున్న కోరికలు తీర్చుకుని శివ సాయుజ్యం, విష్ణు సాయుజ్యం పొంది చివరికి మానవులు కోరుకునే మోక్షాన్ని చేరుకునే మార్గానికి ప్రయత్నం చేయడానికి సరియైన రోజు.

Follow Us:
Download App:
  • android
  • ios