పోటీల్లో గెలుపుకై చాలా శ్రమ పడతారు. శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. పనుల్లో విజయం సాధిస్తారు. కష్టపడడానికి సిద్ధపడతారు. భాగస్వాములతో అనుబంధం పెంచుకునే దిశలో ప్రయత్నం చేస్తారు. ఊహించని ఇబ్బందుల వల్ల కొన్ని పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.

విశ్రాంతికోసం ప్రయత్నిస్తారు. అనవసర ప్రయాణాలు అనవసర ఖర్చులు చేస్తారు. సమయం, కాలం, ధనం వృథా అవుతాయి. సుఖంకోసం ఆరాటపడతారు. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. పాదాల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. విహార యాత్రలు చేసే ఆలోచన ఉంటుంది. పనుల్లో లాభాలు వస్తాయి. సంపాదన పై దృష్టి ఉంటుంది. దురాశ కొంచెం పెరుగుతుంది. పక్కవారితో సరిపోల్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆ విషయాలు పనికిరావు. జాగ్రత్తగా ఎవరికి వారే ఉండాలి. లాభాలు దుర్వినియోగం అవుతాయి. పెద్దల ఆశీస్సులు తొందరగా లభించవు. కళాకారులకు అనుకూలత ఏర్పడుతుంది. సమిష్టి ఆశయాలు, ఆదాయాలు వస్తాయి. నిల్వ ధనాన్ని పెంచుకుటాంరు.

Alsoread Gemini: 2020లో మిథున రాశి ఫలితాలు..

సాయిబాబాకు ప్రదక్షిణలు చేయడం, గురువారాలు ఉపవాసాలు ఉండడం, పసుపుపచ్చ వస్త్రం దానం ఇవ్వడం, శివాభిషేకాలు, శివునికి సంబంధించిన ఆలయాల్లో అన్నదానం చేయడం, ఇడ్లీ, వడలు పంచి పెట్టడం చేయాలి. శ్రీరామ జయరామ జయజయరామ రామ జపం మంచిది.

ఈ రాశివారికి ఈ సంవత్సరం మొత్తంపై చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ అనుకూలతను మరింత వృద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి. పరిహారాలు అంత తీవ్ర స్థాయిలో కాకున్నా కొంత వరకు చేసుకోవడం తప్పనిసరి. ఇప్పుడు చేసుకునే పరిహారాలు ఉన్న స్థితినుంచి ఉన్నత స్థితివైపుకు ఎక్కువ శ్రమలేకుండా వెళ్ళడానికి తోడ్పడతాయి.