Gemini: 2020లో మిథున రాశి ఫలితాలు
మోసపోయే అవకాశం ఉంటుంది. తొందరపాటు పనికిరాదు. ఒకరిని ఒకరు అర్థంచేసుకొని మెలగాలి. తాము చేసే పనుల్లో అనుకూలతను వెతుక్కునే ప్రయత్నం చేయాలి.
సామాజిక అనుబంధాలు కొంత ఒత్తిడిని కలిగిస్తాయి. అధికారులతో జాగ్రత్త వహించాలి. తమకంటే పెద్దవారితో జాగ్రత్త వహించాలి. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. పదిమందిలో పలుకుబడికోసం ఆలోచిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టకూడదు. నూతన పరిచయాలవల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. మోసపోయే అవకాశం ఉంటుంది. తొందరపాటు పనికిరాదు. ఒకరిని ఒకరు అర్థంచేసుకొని మెలగాలి. తాము చేసే పనుల్లో అనుకూలతను వెతుక్కునే ప్రయత్నం చేయాలి.
తాము చేసే పనుల్లో తమకే ఒత్తిడి పెరుగుతుంది. అనవసరమైన కాలయాపన ఉంటుంది. చేసే పనుల్లో భయం ఏర్పడుతుంది. పట్టుదలతో కార్యసాధన అవసరం. పనులకు అనుగుణంగా ఆలోచనల్లో మార్పు చేసుకోవాలి. శరీరానికి ప్రాధాన్యత ఇస్తారు. సెప్గెంబర్ తర్వాత వీరికి సమయం, కాలం, ధనం వృథా అవుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. దూర ప్రయాణాలపైదృష్టి ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేస్తారు.
సామాజిక అనుబంధాల్లో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. నూతన పరిచయస్తులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. పెట్టుబడులు పెట్టకూడదు. మోసపోయే ప్రమాదం ఉంటుంది. అన్ని పనుల్లో వ్యతిరేకత ఉంటుంది. జీవిత వ్యాపార భాగస్వాములతో అనుకోని ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. సెప్టెంబర్ తర్వాత పోటీల విషయంలో అప్రమత్తత అవసరం. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. పోటీలకై ఒత్తిడి పెరుగుతుంది. శ్రమాధిక్యం ఉంటుంది. జాగ్రత్త అవసరం.
ఈ రాశివారు శని, గురు, రాహు, కేతువులకు అన్నిగ్రహాలకు పరిహారాలు చేసుకోవడం మంచిది. ప్రతిగ్రహం కూడా ఏదో ఒక రకంగా కొంత ఒత్తిడిని కలిగిస్తూనే ఉంటుంది.
బద్ధకాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ప్రతిరోజూ యోగా, ప్రాణాయామాలు, లేదా వాకింగ్ చేయడం తప్పనిసరి. దక్షిణామూర్తి ఆరాధన, ప్రత్యక్షంగా గురువులను కలిసి వారి ఆశీస్సులు తీసుకోవడం చేయాలి. దుర్గా స్తోత్ర పారాయణలు, మినప సున్ని ఉండలు, ఇడ్లీ, వడలు దానం చేయాలి. పశు పక్షాదులకు ఆహారాన్ని పెట్టడం. పసుపు రంగు వస్త్రాలను, నీలిరంగు వస్త్రాలను దానం చేయడం మంచిది.