ఒకరు తిన్న ఫుడ్ ను మరొకరు తినొచ్చా? తింటే ఏమౌతుంది?
చాలా మంది.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ గా ఉన్నవాళ్లు తిన్న ఆహారాన్ని తింటుంటారు. కానీ ఇలా ఒకరు తిన్న ఆహారాన్ని తింటే మంచిదేనా? తెలుసుకుందాం పదండి.
మనలో చాలా మందికి అందరితో కలిసి తినే అలవాటు ఉంటుంది. చాలా మంది పిల్లలు తమ ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్లినప్పుడు ఒకరు తిన్న ఫుడ్ ను మరొకరు తింటుంటారు. పెద్దలు కూడా తింటుంటారు. కానీ ఇలా తినడం మంచిదేనా? అసలు ఒకరు తిన్న ఆహారాలు వేరేవాళ్లు తినొచ్చా? లేదా? తెలుసుకుందాం పదండి.
హిందూ మతం ప్రకారం: హిందూ మతం ప్రకారం.. ఆహారం ఎప్పుడూ కూడా శుభ్రంగా, సాత్వికంగా ఉండాలి. ఫుడ్ ను తప్పుడుగా వండితే అది శుభ్రంగా ఉండదు. అందుకే హిందూమతంలో తప్పుడు ఆహారాలను తినడం నిషేదించబడింది. వంట చేసేటప్పుడు చేతులను మురికిగా ఉండకూడదని హిందూ మతంలో చెప్పబడింది.
తింటూ మద్యం సేవించకూడదని శాస్త్రాల్లో ఉంది. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తికి గ్రహ లోపాలు కలుగుతాయి. ఇకపోతే వేరొకరి తప్పుడు ఆహారాన్ని తినడం వల్ల మీరు కూడా ఆ వ్యక్తి బాధలో, అన్ని దురదృష్టాలలో భాగస్వామి అవుతారని చెప్తారు. వేరొకరు తిన్న ఆహారాన్ని తినడం వల్ల మీ సంపద కూడా ప్రభావితం అవుతుందని నమ్ముతారు.
ఇలాంటి పరిస్థితిలో మీరు వేరొకరి ఆహారాన్ని తినడం వల్ల ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. శాస్త్రీయంగా చూస్తే.. ఒకరు తిన్న ఆహారాన్ని మరొకరు తినకూడదని సైన్స్ కూడా చెబుతోంి. ఎందుకంటే ఇది మిమ్మల్ని ఎన్నో వ్యాధుల బారిన పడేస్తుంది. ఒకరు తిన్న ఆహారాన్ని మరొకరు తినడం వల్ల ఒక వ్యక్తికి ఉన్న అంటువ్యాధులు వేరొకరికి వస్తాయి.