1. రమేష్‌ బాబు

భవిష్యత్తు ఎలా ఉంది?

నక్షత్రం శతభిషం 1వ పాదం.

2021 మే వరకు అన్నికీ అనుకూలమైన సమయం. దూర ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంటుంది. 2021 మే నుంచి 2022 జూన్‌ 1 సం|| పాటు అన్ని పనుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. 2022 తర్వాత అనుకూలం మొదలౌతుంది. వైవాహికం జీవిత/ వ్యాపార భాగస్వాముల విషయంలో ఎప్పికీ జాగ్రత్తగా ఉండడం మంచిది. అది అవసరం కూడా.

జపం : శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

దానం : 1. కందిపప్పు/ దానిమ్మపళ్ళు / ఖర్జూరాలు, క్యారెట్, బీట్రూట్  2. నూనె అవసరం ఉన్నవారికి ఇంటిలో వాడుకోవడానికి, / పల్లీలు/ దేవాలయాల్లో దీపారాధనకు వినియోగించాలి.  3. పశుపక్షాదులకు ఆహారం వేయడం తప్పనిసరి.. 4. పులిహోర/ స్త్రీలకు అలంకరణ వస్తువులు, దానం చేయాలి.

 

2.  సోమశేఖర్‌

మీ పుట్టిన వివరాలు జన్మ సమయం ఉదయమా, మధ్యాహ్నమా, నక్షత్రం సరిగా లేనందున మీరు ఇచ్చిన వివరాలు నక్షత్రానికి పొంతన కుదరడం లేదు. మీ వివరాలు సరిగా పంపిచగలరు.

3.  భవాని లక్ష్మణరావు

ఉద్యోగం, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది?

మీకు జీవితం అనుకూలంగా ఉంటుంది. మీరు సెప్టెంబర్‌లోపు వివాహం చేసుకోవడానికి అనుకూల సమయం. కాని వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. కనుక కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆనందంగా ఉండగలరు.

2019 సం|| తర్వాత దాదాపుగా 10 సం||లపాటు ఉద్యోగ మరియు వ్యాపారాదుల విషయంలో ఎదుగుదల బావుంటుంది.

జపం : దేవీంద్రాణి నమస్తుభ్యం, దేవేంద్రప్రియభాషిణి, వివాహం భాగ్యం ఆరోగ్యం పుత్రలాభంచ దేహిమే జపం నిరంతరం చేసుకుంటూ ఉండాలి.

దానాలు : 1. కందిపప్పు/ దానిమ్మపళ్ళు / ఖర్జూరాలు, క్యారెట్, బీట్రూట్  2. నూనె అవసరం ఉన్నవారికి ఇంటిలో వాడుకోవడానికి, / పల్లీలు/ దేవాలయాల్లో దీపారాధనకు వినియోగించాలి.3. గోధుమరొట్టెలు / గోధుమపిండి / 4. కూరగాయలు  ఆకుకూరలు, / పెసరపప్పు, కాకరకాయలు దానం చేయడం తప్పనిసరి.

4.మోహన్‌ నాగ ప్రదీప్‌

ఉద్యోగం పెళ్ళి ఎలా ఉంటాయి?

మంచి ఉద్యోగానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మంచి వృద్ధి ఉంటుంది. 2019 అక్టోబర్‌ నుంచి 2020 డిసింబర్‌ లోపు ఎప్పుడైనా వివాహం కావచ్చు. జీవితంలో మంచి స్థిరత్వం ఉంటుంది. అన్ని పనులు ఆనందంగా సాగిపోతాయి.

జపం : శ్రీ దత్త శ్శరణం మమ, శ్రీ రాజమాతంగ్యై నమః నిరంతరం చేసుకుంటూ ఉండాలి.

దానాలు : 1. నూనె అవసరం ఉన్నవారికి ఇంటిలో వాడుకోవడానికి, / పల్లీలు/ దేవాలయాల్లో దీపారాధనకు వినియోగించాలి.2. గోధుమరొట్టెలు / గోధుమపిండి / 3. కూరగాయలు  ఆకుకూరలు, / పెసరపప్పు, కాకరకాయలు దానం చేయడం తప్పనిసరి. 4. పశుపక్షాదులకు ఆహారం వేయడం తప్పనిసరి. 5 పులిహోర/ స్త్రీలకు అలంకరణ వస్తువులు, దానం చేయాలి.

5.లోకేష్‌

మీ పూర్తి వివరాలు సరిగా తెలియనందున జాతకం సవివరంగా తెలియచేయలేకపోతున్నాము.

గోచార రీత్యా భరణి నక్షత్రం మేషరాశి జాతకులకు అక్టోబరు వరకు గురుడు అనుకూలం కాదు. కావున సామాజిక అనుబంధాల్లో గౌరవం తగ్గడం ఉంటుంది. అక్టోబరు తరువాత అన్నింలో కార్యసిద్ధి ఉంటుంది. అసంతృప్తిని తగ్గించుకోవాలి. క్రింది జపాల ద్వారా కొంత వరకు ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.

గురువారం : దత్తాత్రేయ / సాయిబాబా దేవాలయాల్లో ప్రదక్షిణలు; శనివారం హనుమత్‌ పూజ, హనుమాన్‌ ప్రదక్షిణలు చేయాలి.

దానాలు : కందిపప్పు, నూనె, పళ్ళు అత్యధికంగా దానాలు చేయాలి.

జపం : శ్రీదత్త శ్శరణం మమ, హరహర శంకర, జయజయ శంకర జపం తప్పనిసరి. చేసుకోవాలి.