శనైహి శనైహి అనే సంస్కృత పదంలో నెమ్మది నెమ్మది అనే అర్థాలు ఉంటాయి. శని గ్రహానికి ఆ పేరు ఉంది.  గోచారరీత్యా ఒక రాశినుంచి వేరొక రాశికి మారడానికి దాదాపుగా 2 1/2 సం||లు పడుతుంది. ఏ భావంలో ఉంటే ఆ భావానికి బద్ధకాన్ని కలిగిస్తాడు. అది మానసికమైన కావచ్చు, లేదా శారీరకమైన కావచ్చు. ఆ భావం క్రియాశీలతను కోల్పోతుంది. ప్రస్తుతం వృషభరాశివారికి శని ప్రభావం ఎలా ఉన్నదో చూద్దాం.

వృషభరాశివారికి అష్టమ శని అంటారు. ఈ అష్టమ శని, అర్ధాష్టమశని, ఎలినాటి శని భావాలు లోకంలో కనిపిస్తూ ఉంటాయి. వీరికి ఊహించని ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం చాలా కనిపిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి ఉండే సూచన కనబడుతుంది. అధికారులతో అప్రమత్తంగా మెలగాలి. గౌరవాన్ని కోల్పోయే సూచనలు ఉన్నాయి.

వీరు మాట విషయంలో జాగ్రత్త పడాలి. తొందరపడి వాగ్దానాలు చేయకూడదు. వాగ్దానాల వల్ల కుటుంబ సంబంధాలు ఒత్తిడికి గురయ్యే సూచనలు కనబడుతున్నాయి. కావున మధ్యవర్తిత్వాల జోలికి వెళ్ళకూడదు. మాట విలువ తగ్గుతుంది. ఎదుటివారు అపార్థాలు చేసుకునే సూచనలు కనబడుతున్నాయి. విద్యార్థులు పరీక్షల్లో రాయడానికి కొంత బద్ధకిస్తారు. కావున ఇంో్ల ఉన్నప్పుడు రోజూ వీరు రాయడం అలవాటు చేసుకోవాలి.

వీరికి సంతానం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. ఆలోచనల్లో నెమ్మదత్వం ఉంటుంది. సృజనాత్మతను కోల్పోతారు. కొత్తగా ఏదైనా ఆలోచించి చేయాలి అంటే ఆ ఊహ తొందరగా రాదు.ఏ పనీ ముందరికి వెళ్ళదు. ఒకరు చెప్పిన పనిని మాత్రం చేస్తారు.

అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళపై ఆఫీసర్లకు వీళ్ళకు అంత సఖ్యత కుదరకపోవచ్చు. తోటి ఉద్యోగులతో కూడా ఏవైనా ఇబ్బందులు రావచ్చు. కావున వృత్తి ఉద్యోగాలలో ఉండే వారు ఎదుటివారిపై ఎలాటిం ఆశింపు లేకుండా ఉండాలి.

ఊహించని ఇబ్బందులు, అనవసర ప్రయాణాలు ఉంటాయి. సమయం వృథా కాకుండా చూసుకోవాలి. డబ్బులు వృథా చేసుకోరాదు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. వీరికి అనవసర ఖర్చులు, ఆరోగ్య సమస్యలు ఉంటాయని తెలుసు కాబట్టి వీరు ధర్మకార్యాలపై అధిక వ్యయం చేయాలి. తాము ఏ మాత్రం దాచుకోవాలని ప్రయత్నం చేయకూడదు. దానివల్ల వీరికి వచ్చే అనవసర ఇబ్బందులు వీరి జోలికి రాకుండా ఉంటాయి.

పుణ్యంకొద్ది పురుషుడు దానంకొద్ది బిడ్డలు అనే సామెత వీరికి వర్తిస్తుంది. అవసరార్థికి, అవసరమైన వస్తువు, తమకు చేతనైన దానిలో దానం ఎంత ఎక్కువ చేస్తే సంతాన సమస్యలు అంత తొందరగా తొలగిపోతాయి. వీరు ముందుగానే ఖర్చు పెడతారు కాబట్టి ఆరోగ్యంకోసం హాస్పిటల్స్‌కు పెట్టే అవకాశాలు రావు.

తమను ఇబ్బందిపెట్టేవాళ్ళే తప్పకుండా ఉంటారు. అది వీరికి ముందుగా తెలుసు కాబట్టి వారితో సఖ్యతగా మెలగడం అలవాటు చేసుకోవాలి. వారితో మిత్రత్వవైఖరిని అవలంబించాలి. తొందరపడకూడదు. వారు ఏమన్నా ప్టించుకోకూడదు. తమ పని తాము చేసుకుంటూ వెళ్ళాలి. నిరంతరం ఓం నమశ్శివాయ జపం చేసుకుంటూ ఉండాలి.

వీరికి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడం కోసం ఆహారాన్ని బాగా నమిలి తినాలి. రోజూ నువ్వులు బెల్లంతో చేసిన పదార్థాలు కూడా తీసుకోవాలి. శరీరంలో వేడి పెంచుకునే ప్రయత్నం చేయాలి. గ్యాస్‌ ప్రాబ్లమ్స్‌ రాకుండా జాగ్రత్త పడాలి. కడుపులో ఉన్న అనవసర గ్యాస్‌ను బయటకు పంపే ప్రయత్నం చేయాలి. కపాలభాతి ప్రాణాయామం రోజుకు 350కి తగ్గకుండా చేసుకోవడం మంచిది.

డా.ఎస్.ప్రతిభ