శని బద్ధకమైన గ్రహం. నెమ్మదిగా కదులుతాడు, ఇతను శని శరీరంలో విసర్జక వ్యవస్థకు కారకుడు అవుతున్నాడు. గోచార రీత్యా ఒక రాశిని దాటానికి 2 1/2 సం||లు పడుతుంది. ప్రస్తుతం మిథునరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. వివాహ సమస్యలు, వైవాహిక జీవితం ఎలా ఉంటుందో చూద్దాం.

మిథున రాశివారు కొంత బద్ధకాన్ని కలిగి ఉంటారు. శరీరంలో విసర్జక వ్యవస్థకు శని కారణం అనుకున్నాం. ఏ వ్యస్థకి, ఏ భావానికి కారకత్వం వహిస్తే ఆ భావం బద్ధకం ఉంటుంది. వీరు దేనినీ వదులుకోవడానికి ఇష్టపడరు. వదులుకోవడం అంటే వీరికి ఇష్టం ఉండదు.

వీరికి సామాజిక అనుబంధాలు, వైవాహిక అనుబంధాల్లో కొంత సమస్యలు ఉంటాయి. వివాహం కానివారు ఈ సంవత్సరం కొంత శ్రమ అధికంగా చేయాలి. జాతకం అనుకూలంగా ఉంటే పర్వాలేదు కాని, జాతకంలో కూడా శని దోషకారి అవుతే వీరికి వివాహం ఆలస్యం అయ్యే సూచనలు ఉన్నాయి. వివాహం అయిన వారికి జీవిత భాగస్వామి అనుబంధాల్లో జాగ్రత్త అవసరం. తొందరపడకూడదు.

సౌకర్యాలు శ్రమను కలిగిస్తాయి. సౌకర్యాలవల్ల కూడా కొంత బద్ధకం పెరుగుతుంది. గృహం, వాహనం, ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటాయి. ఆహారంలో సమయపాలన తప్పనిసరి.

అనుకున్న పనులు తొందరగా పూర్తికావు. ప్రతీ పనిలోను ఆలస్యం అవుతుంది. చికాకులు పడకూడదు. సమయం బాగా లేదనుకుని సరిదిద్దుకోవాలి. తాను చేసే పనుల వల్ల తమకు ఇబ్బంది కలుగవచ్చు. ఎదుటివారికి సలహాలు ఇవ్వడం తగ్గించుకోవాలి.

జీవిత భాగస్వాములతో అప్రమత్తంగా ఉండాలి. ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. సమయం బాగాలేదని సరిచూసుకోవాలి. అనవసర తొందరపాటు పనికిరాదు. ఒకసారి తొందరపడితే అది జీవితాంతం గుర్తు ఉంటుంది. మంచి జరిగితే పర్వాలేదు కాని ఏదైనా మానసిక ఒత్తిడి అధికమైతే తొందరగా మర్చిపోలేరు. కాబట్టి జాగ్రత్తఅవసరం. వివాహం కాని వారు ఏదో ఒకి చేసుకుందాం అని ఆలోచనకు రాకూడదు. మనస్ఫూర్తిగా అంగీకరిస్తేనే వివాహం చేసుకోవాలి.

సౌకర్యాల వల్ల అనారోగ్యం వచ్చే సూచనలు. ఆహారం మితంగా స్వీకరించాలి. బాగా నమిలి తినాలి. పీచు పదార్థాలు ఆహారంలో స్వీకరించాలి. ఓ్‌్స లాటింవి తీసుకోవాలి. ద్రవపదార్థాలు ఎక్కువగా ఉండాలి. పిం నొప్పులు లాటివి రాకుండా జాగ్రత్త పడాలి. వీరికి గుప్త వ్యాధులు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ప్రతీరోజూ 2 పూటలా స్నానం తప్పనిసరి అలవాటు చేసుకోవాలి.

మిగిలిన రాశివారికి ఉన్నంత అనుకూలత వీరికి ఉండదు. అలా అని శనిగ్రహం పూర్తిగా ఇబ్బంది కారి అని కూడా అనలేం. 50 శాతం అనుకూలత ఉంటుంది. 50 శాతం శ్రమ ఉంటుంది. 50 అనుకూలతను వీరు ఎక్కువగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకుంటే అన్నీ మారిపోతాయి.

వీరు శివాలయానికి ప్రతీరోజూ వెళ్ళి ప్రదక్షిణం చేయడంకాని లేదా ఉదయాన్నే వాకింగ్‌గాని తప్పనిసరిగా చేయాలి. పొట్టను లోపలికి స్వీకరించే ప్రాణాయామం, అనగా బాహ్య ప్రాణాయామం వీరు తప్పనిసరిగా చేయాలి. దానివల్ల శరీర సంబంధ అనారోగ్యాలు రాకుండా కాపాడుకోవచ్చు.

శివకల్యాణం జరిపించాలి.  శివాభిషేకం కూడా తప్పనిసరి. శివ పార్వతులు ఆది దంపతులు కావున వారి ఫోలను చూస్తూ తాము అందరికీ ఆదర్శంగా ఉండాలనే ఆలోచనను పెంచుకోవాలి.

డా.ఎస్.ప్రతిభ