వీరికి మాట విలువ తగ్గుతుంది. మ్లాడేటప్పుడు ఆచి, తూచి వ్యవహరించాలి. తొందరపడి మ్లాడకూడదు. మాటవల్ల కుటుంబ సంబంధాలు దూరమయ్యే అవకాశం. తమ మాట వల్ల ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. నిల్వ ధనాన్ని కోల్పోతారు. అన్ని పనుల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా ఆచి, తూచి వ్యవహరించాలి.

సంతాన సమస్యలు అధికమౌతాయి. సంతానం వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లలు మాట వినరు. సృజనాత్మకతను కోల్పోతారు. వీరు పరిపాలన సంబంధ హోదాలో ఉంటే  పరిపాలన పనులు జాగ్రత్తగా వ్యవహరించాలి. కళాకారులకు ఒత్తిడి సమయం. అనవసర ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. చేసే పనుల్లో నిరాశ, నిస్పృహలు ఎదురౌతాయి.

సామాజిక అనుబంధాల్లో లోటుపాట్లు కనబడతాయి. వ్యాపారస్తులు తొందరపడకూడదు. పెట్టుబడులు కోల్పోయే అవకాశం ఉంటుంది. నూతన పరిచయస్తులతో జాగ్రత్తగా ఉండాలి. తొందరగా ఎవరినీ నమ్మకూడదు. నూతన పరిచయాలు పెంచుకోకూడదు. జీవిత మరియు వ్యాపార భాగస్వాములతో ఆచి, తూచి వ్యవహరించాలి. సంఘంలో గౌరవం తగ్గే సూచనలు. పదిమందిలో పలుకుబడికోసం ప్రయత్నించకూడదు. డబ్బులు, వృథా అయ్యే సూచనలు.

కొంత శ్రమ తరువాత పెద్దవారి సహాయ సహకారాలు లభిస్తాయి. కళాకారులకు అనుకూల సమయం. శ్రమలేని ఆదాయం వస్తుంది. అనుకోని ఒత్తిడి ఉంటుంది. పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఇతరులపై ఆధారపడతారు. అన్ని విధాల లాభాలు ఉంటా యి. కళాకారులకు అనుకూల సమయం ఉంటుంది. ఎన్ని పనులు చేసిన సంతృప్తి లోపం మాత్రం ఉంటుంది. ఏదో ఒక వెలతి కనిపిస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద ఊహలు ఉంటా యి. ఊహలకు అనుగుణంగా శరీరం సాగదు.

వీరు మ్లాడే విషయంలో జాగ్రత్త పడాలి. తక్కువ మ్లాడుతూ ఎక్కువగా మౌనాన్ని పాటించాలి. ఎదుటివారు వీరి మాట వల్ల అపార్థం చేసుకుటా ంరు. కాబట్టి మ్లాడకపోవడం మంచిది. అన్ని సందర్భాల్లో తాము ఏదో చెప్పాలని, తమకు ఏదో తెలుసుననే భావన తగ్గించుకోవాలి. దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. ధనం ఎలాగూ పోతుందని తెలుసు కాబట్టి ధనం తమ దగ్గరి నుంచి పోవడానికి అవకాశం లేనంతగా ముందుగానే దానం చేయాలి. తాము ఒకపూట కొంచెం తక్కువగా ఆహారాన్ని తీసుకున్నా పర్వాలేదు. అలాగే తమకు కావలసిన సౌకర్యాలు కొన్ని తగ్గించుకున్నా పర్వాలేదు. సౌకర్యాలు లేవు అనే ఆలోచన రానివ్వకూడదు.

దానం కొద్ది బిడ్డలు అనే సామెత వీరికి వర్తిస్తుంది. వీరు దానం ఎక్కువగా చేయకపోతే మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఆ మానసిక ప్రశాంతతే అన్ని పనులు మూలం అవుతుంది. మనస్సుతోనే అన్ని పనులు చేస్తారు. సంతానం తమ మాట వినడానికి కూడా ఈ మనస్సే కారణం. తాము మనస్సులో ఏ రకమైన ఆలోచనలు లేకుండా ఉంటేనే ఈ పని సాధ్యపడుతుంది. తమ మనస్సు అనేది ఒక కాఫీ కప్పు అనుకుంటే ఆ కాఫీ కప్పులో ఎప్పుడూ నిండుగా టీ , కాని కాఫీ గాని పోసి నింపి ఉంచకూడదు. ఆ కప్పు ఎప్పుడూ ఖాళీగా ఉంటేనే కొత్త ఆలోచనలు ఎదుటివారికి మరియు తమకు ఉపయోగపడేవి సలహా ఇవ్వగలరు. లేకుంటే ఎప్పుడూ బురదదో కూడిన సలహాలు మాత్రమే ఇస్తారు. అవి ఎవరికీ ఉపయోగపడవు సరి కదా ఎవరూ మీ మాట వినే స్థాయిలో ఉండరు. కాబట్టి జాగ్రత్త వహించాలి.

లాభాలు వచ్చినా ఆ వచ్చిన లాభాలు సంతోషాన్వి ఇవ్వలేవు. కాబట్టి ఈ రాశివారు అన్ని రకాలుగా కూడా ధార్మిక కార్యక్రమాలు అంటే ప్రకృతిని కాపాడే పనులు ఎక్కువగా చేస్తూ ఉండాలి.

చెట్లునాటించడం, పశుపక్షాదులకు ఆహారం పెట్టడం, నీరు పెట్టడం చేయాలి. సేవ ద్వారా తమలోని లోపాన్ని ఎక్కువగా తొలగించుకునే ప్రయత్నం చేయాలి. డబ్బులకంటే ఎక్కువ శరీరాన్ని కష్టపెట్టాలి. దాని ద్వారా మాత్రమే శని గ్రహ లోపాలు తొందరగా తొలగుతాయి.

డా.ఎస్.ప్రతిభ