వీరికి అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటా యి. విశ్రాంతి లభించదు. విశ్రాంతికోసం ఎక్కువ ఆరాటపడతారు. మనిషికి ఏది తనకు లేదో దాని గురించి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మకరరాశి వారు తమకు విశ్రాంతి సరిగా లేదని ఎప్పుడూ దానిగురించే ఆలోచిస్తూ అనవసరమైన అనారోగ్యం తెచ్చుకుంటారు. వీరి ఖర్చులు కూడా అనవసరంగా చేస్తారు. దూర ప్రయాణాలకు వెళ్ళేలనే ఆలోచన ఉంటుంది. కాని డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కువగా ఖర్చు అవుతుందేమోనని.

కుటుంబ సంబధాలు ఒత్తిడికి గురి చేస్తాయి. మధ్యవర్తిత్వాలు అంతగా కలిసిరావు. వీరు వాటిపై దృష్టి పెట్టకూడదు. ఏ సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించకూడదు. మాట విలువ తక్కువగా ఉంటుంది.  వాక్‌ చాతుర్యం ఉండదు. ఏవైనా మ్లాడాలంటే కొంత తడబాటు ఉంటుంది. కిం సంబంధ లోపాలు వచ్చే అవకాశం. నిల్వ ధనాన్ని కోల్పోతారు. గృహ, కుటుంబ విషయాలు తమకు అనుకూలంగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటా రు. సమయానికి అన్నీ సమకూరక ఇబ్బంది పడతారు.

పోటీ లు అధికంగా ఉంటా యి. వాటిని తట్టుకుని నిలబడే శక్తి సామర్థ్యాలు పెంచుకోవాలి. ప్రతీ విషయంలో ద్వంద్వ వైఖరీ అంటే రెండు వైపులా ఆలోచనలు పనికిరావు. శత్రువులు ఎదురు తిరిగే అవకాశం. ఋణ సంబంధ ఆలోచనలు పెరుగుతాయి. పరాక్రమం పెంచుకోవాలి. అనవసర ఒత్తిడులకు లోనుకాకుండా జాగ్రత్తపడాలి.

వీరికి అన్ని పనుల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులు అధిక శ్రమతో తక్కువ ఫలితాలు సాధిస్తారు. దూర ప్రయాణాలు చేయాలనే ఆలోచన ఉంటుంది. విదేశీ వ్యవహారాలు అంతగా అనుకూలించవు. చేసే అన్ని పనుల్లోను సంతృప్తి తక్కువగా ఉంటుంది. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో పట్టుదల అవసరం.

విశ్రాంతికై ప్రయత్నిస్తారు. అనవసర ఖర్చులు ఉంటా యి. ఆధ్యాత్మిక యాత్రలపై దృష్టి పెడతారు. పాదాల నొప్పులు ఉంటా యి. అనవసర ఒత్తిడులు వచ్చే సూచనలు. మొండితనంతో మాత్రమే పనులు పూర్తి చేస్తారు. కాని ఆలోచనతో కాదు.

వీరు విశ్రాంతికోసం ప్రయత్నం చేయకూడదు. ఆ విశ్రాంతి కావాలనుకునే సమయంలో యోగాసనాలు, ప్రాణాయామం, జపం, ధ్యానం, దానం చేసుకోవడం మంచిది. అప్పుడు మాత్రమే వీరికి మానసిక విశ్రాంతి మరియు శారీరక విశ్రాంతి రెండూ లభిస్తాయి. వీరికి శరీరం కన్నా కూడా మనసు ప్రశాంతంగా ఉండడం ముఖ్యం. మనసు ప్రశాంతంగా లేకపోతే ఏ పనులు చేయలేరు.

వీరికి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది కావున వీరు వారానికి ఒకసారి అభ్యంగన స్నానం చేయడం తప్పనిసరి. దైవదర్శనాలు తప్పనిసరిగా చేయాలి. తీసుకునే ప్రతీ ఆహారంలో శక్తి ఉన్నదని ఆ శక్తి తమకు అన్ని అవయవాలకు వినియోగపడుతున్నది వ్యర్థమైన పదార్థాలు తమ శరీరంలోనుంచి బయికి వెళ్ళిపోతున్నాయనే భావన బాగా చేసుకోవాలి. వదులుకునే తత్త్వాన్ని అలవాటు చేసుకోవాలి. పట్టుకునే తత్వం మాత్రమే ఉంటే జీర్ణక్రియ సరిగా పనిచేయదు. మకర రాశివారు సహజంగానే కొంత బద్ధకాన్ని కలిగి ఉంటా రు. వీరికి వదులుకోవడం తొందరగా ఇష్టపడదు. అన్నీ తమకు కావాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. తాము కష్టపడకుండా అన్నీ తమకు కావాలనే కోరిక తమకు ఎక్కువగా ఉంటుంది. కాబ్టి కొంత వరకు జాగ్రత్త వహించడం మంచిది.

డా.ఎస్.ప్రతిభ