వీరికి బద కం కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఏ పని చేయాలన్నా తొంద రగా పూనుకోరు. పనులు మొద లు పెట్టడానికే చాలా ఆలోచిస్తారు. మొద లు ప్టోక ఎలా తప్పించుకోవాలో, ఎవరైనా తమ పనులు చేస్తారా అని ఆలోచిస్తూ ఉంటారు.  అన్ని పనుల్లో మొద లు ఆలస్యం ఉంటుంది. వీరు ఈ సంవత్సరం వ్యాపారాలు ప్రారంభించడం మంచిదికాదు. ఒకచోట పనిచేయడం మాత్రమే మంచిది. కొత్త ఉద్యోగాల అన్వేషణ మంచిది కాదు. కొత్త ఉద్యోగాలలో కొంత ఒత్తిడి, చికాకులు ఉంటాయి. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. తమ పనులు చేసుకోవడానికి ఏ మాత్రం బద్దకించకూడదు.

వీరికి బద కం కాస్త ఎక్కువశాతంలో ఉంటుంది అని తెలుసుకున్నప్పుడు దానిని వదిలించుకునే ప్రయత్నం తప్పకుండా చేయాలి. ప్రతీరోజూ ఉదయం సూర్యోదయం కన్నా పూర్వమే నిద్ర లేవాలి. వాకింగ్‌, యోగాసనాలు ప్రతీరోజూ ఒక గంటకు తక్కువ కాకుండా చేసుకోవాలి. అలాగే ప్రాణాయామాలు తప్పనిసరిగా చేయాలి. ఒకరోజు బద్ద కిస్తే అది అలాగే అవుతుంది. ఏ పనినైనా చేయడానికి ముందు వీరు కాల ప్రణాళిక వేసుకోవాలి. ఉడా : వీరు 10 గంటలకు ఆఫీసుకు చేరాలనుకుంటే వీరు ఒక అరగంట ముందుగానే అనగా 9.30 వరకు వీరు ఆఫీసుకు రీచ్‌ కావాలని సమయం పెట్టుకోవాలి. అప్పుడు ఏ పనులు కూడా ఆలస్యం కాకుండా అన్ని పనులు సమయానికి పూర్తి అవుతాయి. ఏ ఒత్తిడి లేకుండా పూర్తి అవుతాయి. పనులు పూర్తి కావడం ముఖ్యం కాదు. ఒత్తిడి లేకుండా అనుకున్న సమయానికి పూర్తి కావాలి.

సేవకుల సహకారం కొంత వరకు లభిస్తుంది. ఆధ్యాత్మిక చిన్న చిన్న యాత్రలు వీరికి అనుకూలిస్తాయి. కమ్యూనికేషన్స్‌ కొంత వరకు పరవాలేదు. విద్యార్థులు అధిక శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు.

విద్యార్థులు వినడం, చద వడం కంటే కూడా రాయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పి నుంచి రాయడం అలవాటు చేసుకుంటేనే పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. ఆ అలవాటు లేకపోతే పరీక్ష సమయంలో అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు. తోటివారికి తాము ఏ విషయమైన చెప్పాలనుకుంటే ఒకికి రెండు సార్లు వారికి అర్థమయ్యేలా చెప్పండి. తొంద రపాటు పనికిరాదు. దానివల్ల అపార్థాలు వస్తాయి.

సామాజిక అనుబంధాల్లో లోపాలు ఉంటాయి. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టకూడదు. ఒకవేళ పెట్టి ఉంటే వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సంఘంలో గౌరవం కొద్దిగా తగ్గే సూచనలు ఉన్నాయి.

గౌరవాన్ని పెంచుకునే ప్రయత్నంలో పొరపాట్లు చేయకూడదు. జీవిత మరియు వ్యాపార భాగస్వాములతో తొంద రపాటు లేకుండా నెమ్మదిగా వ్యవహరించాలి. అపార్థాలు రాకుండా చూసుకోవాలి. భాగస్వాముల విషయంలో ఒకరికి సమయం అనుకూలంగా లేదు కావున తోటివారు వీరికి సమయం అనుకూలంగా లేదు కావున ఇప్పుడు ఏమీ అనకూడదు అని సర్దుకుపోయే తత్త్వాన్ని అలవాటు చేసుకోవాలి.

వృత్తి ఉద్యోగాదుల్లో అధికారులతో ఒత్తిడి ఏర్పడుతుంది. ఉద్యోగంలో కొంత చికాకులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. షేర్‌ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకూడదు. కొత్త వాటిపై దృష్టి పెట్టకూడదు. ఉన్న ఉద్యోగంలోనే జాగ్రత్తగా మసలుకోవాల్సిన సమయం.

ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం అంత అనుకూలత ఉంటుంది. బద్దకం కొంత ఎక్కువగా ఉంటుంది అని తెలుసు కాబట్టి జాగ్రత్త వహించాలి. నెలకు ఒకసారి అభ్యంగనస్నానం తప్పనిసరిగా చేయాలి. నువ్వుల లడ్డూలు తీసుకోవాలి. జీర్ణ క్రియ వేగంగా జరగడానికి శరీరంలో వేడి ప్టుటించే పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. శని వాయుతత్వ గ్రహం కాబట్టి వేడి ఎక్కువగా ఉండదు. వేడిని పుట్టించే పదార్థాలు ఎప్పుడూ ఆహారంలో తీసుకుంటూ ఉండాలి.

డా.ఎస్.ప్రతిభ