ఎవరైనా తమ శరీరం నుండి రక్తం కారుతున్నట్లు కల వస్తే.. భయపడాల్సిన అవసరం లేదట. అది శుభానికి సూచనట. తమను ఎవరైనా  చంపినట్లు కల వచ్చినా.. కూడా మంచిదేనట. 

జ్యోతిష్యులు , మనస్తత్వవేత్తల ప్రకారం, కలలు అనేది మన కోరికలు, కలలు, జ్ఞాపకాలు, ఆలోచనలు , ఆశలన్నింటికీ గుప్త రూపం. కొన్నిసార్లు కలలో కనిపించే కొన్ని విషయాలు, జరిగే కొన్ని సంఘటనలు భవిష్యత్తును సూచిస్తాయి. కలకు దాని అర్థం ఏంటో ఓసారి చూసేద్దామా..


ఎవరైనా తమ శరీరం నుండి రక్తం కారుతున్నట్లు కల వస్తే.. భయపడాల్సిన అవసరం లేదట. అది శుభానికి సూచనట. తమను ఎవరైనా చంపినట్లు కల వచ్చినా.. కూడా మంచిదేనట. మీకు నిజ జీవితంలో ఆస్తులు పెరుగుతాయి అనడానికి అది ఉదాహరణ అట. 

కలలో సముద్రం వస్తే..
కదిలే అలలు, ప్రవహించే సముద్రపు నీరు లక్ష్మీదేవికి సంకేతం. సముద్రం చంద్రుడు , ఇతర గ్రహాలతో సంకర్షణ చెందుతుంది. కాబట్టి సముద్రం కలలోకి వస్తే.. మీ సంపాదన పెరుగుతుందని అర్థమట.


ఒకవేళ మీకు వచ్చిన కలలో 
కుండపోత వర్షం కురుస్తుంది, అంటే మీ సంబంధం త్వరలో దెబ్బతింటుంది. భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే, ఈ కల మరో అర్థం ఏమిటంటే మీరు త్వరలో మీ వ్యాపారంలో విజయం సాధిస్తారు.

కలలోకి చేపలు వస్తే.. అది కూడా అదృష్టాన్ని తీసుకువస్తుందట. మీరు కలలో చేపలను చూసినట్లయితే, ఇది మంచి సూచిక. ముఖ్యంగా చేపలు అమ్మేవారిని చూస్తే మీ ఆర్థిక పరిస్థితి త్వరలోనే కోలుకుంటుంది.

తెల్ల ఎద్దు 
తెల్ల ఎద్దు సాధారణంగా కలలోకి రాదు. కానీ అలా వచ్చినట్లయితే.. భూమి లాభసాటిగా ఉందని అర్థం. ఎల్లప్పుడూ సంపద లేదా భూమి ఉంటుంది. మీరు తెల్లటి ఎద్దుతో ఆడుకోవాలని కలలుగన్నట్లయితే, రాబోయే 5 రోజుల్లో ఆర్థిక లాభం ఉందని అర్థం.

పండ్లు
మీరు కలలో పండ్లను తిన్నట్లు కనిపిస్తే, మీరు త్వరలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. సీఫుడ్, మామిడి, వాల్‌నట్, ఉల్లిపాయ, వెల్లుల్లి, పసుపు వేరు, మీగడ, చక్కెర, పెరుగు, మజ్జిగ, పాలు, దానిమ్మ, పుచ్చకాయ వంటి ఆహారాలు.. ఏవి కలలోకి వచ్చినా.. మీకు అనుకోని ధన ప్రాప్తి కలుగుతుందని అర్థం.

ఒకవేళ నదిలో స్నానం చేయాలని కలలుగన్నట్లయితే, ఆ వ్యక్తి ధనవంతుడు అవుతాడు. తన తలపై తానే కిరీటం పెట్టుకోవాలని కలలుగన్నట్లయితే, కోటీశ్వరుడు కావాలనే ఆ వ్యక్తి కల నెరవేరుతుందని అర్థం.

ఒక కలలో నోటు లేదా నాణెం కనిపిస్తుంది, ఇది మీ డబ్బు పెరుగుతుందని సూచిస్తుంది. ముఖ్యంగా మీరు ఆ కలలో ఎవరికైనా డబ్బు ఇస్తున్ట్లు కనపడితే.. మీరు నిజ జీవితంలో ధనవంతులు అవుతారని అర్థమట.