Asianet News TeluguAsianet News Telugu

దుర్గాదేవి అవతారంలో అమ్మవారు

నెమిలిపింఛం రంగు చీర ధరించి అమ్మ అభయాన్ని కలిగిస్తుంది. అమ్మవారికి  నైవేద్యంగా శర్కర పొంగలి సమర్పిస్తారు.

dasara special.. durga devi avataram
Author
Hyderabad, First Published Oct 16, 2018, 3:37 PM IST

ఓం దుర్గేస్మృతాహరసి భీతిమశేషజంతోః

స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాందదాసి.

దారిద్య్రదుఃఖభయ హారిణి కటా త్వదన్యా

సర్వోపకటా రకరణాయ సదార్ద్ర చిత్తా

దుర్గాదేవి ధైర్యానికి   ప్రతీకగా నిలిచి నవరాత్రుల్లో ఎనిమిదవరోజు విశేషంగా దర్శనమిస్తుంది. సింహవాహినియైన అమ్మ మన కటా ర్యాలను నిర్విఘ్నంగా నెరవేర్చడానికి   ధైర్యాన్ని అందిస్తుంది. ఈ అమ్మను కొలిస్తే సర్వకటా ర్యసిద్ధి కలుగుతుంది. అటువిం      అమ్మ నవరాత్రుల్లో దుర్గాష్టమినాడు విశేష పూజలందుకుంటుంది.

తెలంగాణ ప్రాంతంలో విశిష్టమైన పండుగ బతుకమ్మ. ఇది కూడా నవరాత్రుల ప్రకృతి శక్తికి   సంకేతమే. నవరాత్రులకన్నా ఒకరోజు ముందుగానే భాద్రపద బహుళ అమావాస్య నుండి (పితృ అమావాస్య - పెత్రమాస) ప్రారంభమై 9 రోజుల పాటు కొనసాగి సద్దుల బతుకమ్మతో (ఆహార సంపదలతో కూడిన తల్లి) పూర్తి అవుతుంది. వెంపలి చెట్టు ప్రతిష్ఠతో బొడ్డెమ్మగా, మూలదేవతగా ఉంటూ, ప్రకృతి నుండి వెలువడే ఎన్నో తేలికైన పూలను పేర్చి వాటి పైన గౌరీదేవిని ప్రతిష్ఠించి, సాయంకటా లం సమయంలో వాని చుట్టూ తిరుగుతూ, ఆడుతూ, పాడుతూ ఆనందాన్ని పొందే పండుగ ఇది. నియమ నిష్ఠలు కూడా దీనిలో అధికమే.

వైజ్ఞానికంగా ఒక అరోమా థెరపీ కూడా ఈ పండుగలో కనిపిస్తుంది. ఆయుర్వేద గుణాలున్న పుష్పాల చుట్టూ తిరుగుతూ చేసుకునే ఈ పండుగ, ఈ దక్షిణాయన, శరత్కాలాలలో సూక్ష్మజీవులు, దోమల ద్వారా వ్యాపించే వేరు వేరు రోగాల నుండి తట్టుకునేశక్తిని, ఆనందాన్ని పంచుకునే శక్తిని పెంచుతుంది. స్త్రీలకు సంబంధించిన హార్మోనల్‌ సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది.

సామాజిక జీవనంలో అందరిమధ్యలో ఒక సానుకూలత ఏర్పడానికి, అనేక కథల ద్వారా మానసికంగా మళ్ళీ మళ్ళీ దైవ, ధర్మ కటా ర్యాల వైపు స్త్రీలను ప్రేరేపింపడానికి  , శరీరానికి   ఆటల ద్వారా పునః చైతన్యాన్ని పొందడానికి  , పాటల ద్వారా ఆనందాన్ని వికసింప జేసుకోవడానికి  తెలంగాణ ప్రాంతంలోని బతుకమ్మ పండుగ ఆదర్శంగా నిలుస్తుంది.

నవరాత్రులలో ప్రతిరోజూ పెట్టే నైవేద్యాలకు ప్రతీకగానే ఈ సద్దుల బతుకమ్మనాడు 9 రకటా ల వేరు సద్దులు (నైవేద్యాలు) పెట్టి పూజింపటమే ఈ అమ్మవారి ప్రత్యేకత. వ్యక్తికి   ధైర్యం చాలా ముఖ్యమైనది. ధైర్యం ఉన్నచోట అనేక రకటా ల వ్యవహారాల్లో నిలదొక్కుకునే స్థితి ఏర్పడుతుంది. జీవితంలో ఏన్నో మనం ఛేదింపలేని, గమింపలేని వ్యవహారాలను పోరాడి సాధించాల్సిన అవసరాలు ఏర్పడతాయి. అటువిం      దుర్గమమైన అంశాలను సాధించే శక్తి దుర్గాశక్తి. దుర్గమాసురుడు అనే రాక్షసుడిని చంపిన ఆవిడ ఈ దేవత. వాహనమైన సింహం కూడా విజయానికి   సంకేతమైనదే. ప్రకృతి శక్తులలో ఒక భీషణమైన శక్తి ఇది. చండిగా అందరూ కొలిచే ఈ అమ్మవారికోసం ఉపాసకులు ఎందరో ఎన్నో హోమాలను నిర్వహిస్తారు. సూర్యుని నుంచి వచ్చే ప్రపరడమైన కి  రణాల శక్తి ఇది. మనలోని మహామాయను తొలగించేటువిం     ది, రోగాన్ని తగ్గించేది, బాధలను ఉపశమింపజేసేది, భయాన్ని తొలగించేటువిం     ది, దరిద్రాన్ని, దుఃఖాన్ని తొలగించేది, సర్వమంగళగా భావిం  బడేది అయిన ఈ అమ్మవారిని ఈ నవరాత్రుల సందర్భంలో శరణు వేడుకోవలసిందే.

నెమిలిపింఛం రంగు చీర ధరించి అమ్మ అభయాన్ని కలిగిస్తుంది. అమ్మవారికి   నైవేద్యంగా శర్కర పొంగలి సమర్పిస్తారు.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios