లలితా త్రిపురసుందరీ దేవిగా అమ్మవారు

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 11, Oct 2018, 12:05 PM IST
dasara navaratri special lalitha tripura sundari devi
Highlights

అమ్మవారు ఎరుపురంగు చీరను ధరించి మన మనోకామనలను నెరవేరుస్తుంది. ఈరోజు అమ్మకు సమర్పించే నైవేద్యం దద్దోజనం. దద్దోజనంలో పెరుగు, మిరియాలు, జీలకర్రను ఉపయోగిస్తారు. మిరియాలు ఉష్ణాన్ని పెంచి కఫాన్ని తగ్గిస్తాయి.

ప్రాతః స్మరామి లలితా వదనారవిందం

బింబాధరం పృథుల మౌక్తిక శోభినాశమ్‌

ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాఢ్యం

మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్‌

''లకార రూపా లలితా, లక్ష్మీ వాణీ నిషేవితా''గా పిలువబడే అమ్మ నవరాత్రుల్లో నాల్గవరోజు లలితా త్రిపురసుందరిగా దర్శనమిస్తుంది. అమ్మను ఈరోజు సేవిస్తే సర్వ విధ సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. అత్యున్నత స్థితి లభిస్తుంది.

ప్రకృతిశక్తికి   ప్రతీక లలితాదేవి. మన చుట్టూ ఉండే పాంపభౌతికశకే లలితా. పంపభూతాలన్నీ ఒకదానిలో ఒకి   ఇమిడి ఉన్నాయి. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే ఐదు తన్మాత్రల ద్వారా ఒకదానిలో ఒకి   చొచ్చుకొని ఉన్నాయి. ఇన్నిటిలోను ఉండే శక్తి మరొకి  ఉంది. ఆ శక్తినే లలితగా భావన చేసే సంప్రదాయం భారతీయులది. ఇంకా విశేషంగా భూమిచుట్టూ ఉన్న ఓజోన్‌ పొర లోపలి భాగంలో జీవశక్తి వృద్ధి చెందుతుంది. ఈ అంశాన్ని శ్రీ సూక్తం (హిరణ్యప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం) ఈ శక్తి హిరణ్య ప్రాకారాంతర్గతమని చెప్పడం జరిగింది. అంటే హిరణ్య ప్రాకారమే ఓజోన్‌ పొర. ఈ ఓజోన్‌ పొర (హిరణ్య ప్రాకారం)కు బయట జ్వలంతిగా లోపలివైపు ఆర్ద్రగా కనిపిస్తుంది. భూమి శివలింగంగా భావనచేస్తే భూమి చుట్టూ ఆవరించి ఉన్న ఈ అమ్మవారిని లలితగా భావన చేస్తాం. అందుకే శివుని మీద కూర్చున్న లలిత విగ్రహాలుగా మనం చూస్తూఉంటాం . ఈ అమ్మవారి ఉపాసన వ్యక్తిలో సౌమ్యత్వాన్ని పెంచుతుంది. కామ్యార్థాలకు, మోక్షార్థాలకు రెండింకి   కూడా లలితాదేవి ఆలంబన. శ్రీపక్ర స్థితంగా కనిపించే అమ్మవారు సృష్టి సంబంధమైన వేరువేరు భాగాలలో వేరు వేరు రూపాల్లో కనిపిస్తుంది. దీనినే మేరువుగా కూడా విస్తరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వేరు వేరు భాగాలలో ఉండే లలితాఅమ్మవారి శక్తిని ఖడ్గమాలగా కూడా కొలిచే సంప్రదాయ ఉంది. ఆత్మ, మనస్సు, శరీరం అనేవి మూడు పురాలు. వీటినే త్రిపురాలు అంటారు. ఈ మూడు పురాలలో ఉండే రాక్షసత్వం (త్రిపురాసురులు) తొలగిస్తే అమ్మ సౌందర్యాన్ని నింపి త్రిపుర సుందరిగా వెలసిల్లుతుంది.

ఈ పాంపభౌతికశక్తి సమాహారమైన అమ్మవారిని తత్త్వాన్ని ఉపాసిస్తే మన పాంచ భౌతిక శరీరంలో అన్ని భాగాలలోను అనంతమైన శక్తి చేకూరి మనని శాశ్వతులను చేసే ప్రయత్నం జరుగుతుంది. అందుకే ఆ తత్త్వాన్ని తెలుసుకుని ఈ నవరాత్రుల్లో ఉపాసిద్దాం.

అమ్మవారు ఎరుపురంగు చీరను ధరించి మన మనోకామనలను నెరవేరుస్తుంది. ఈరోజు అమ్మకు సమర్పించే నైవేద్యం దద్దోజనం. దద్దోజనంలో పెరుగు, మిరియాలు, జీలకర్రను ఉపయోగిస్తారు. మిరియాలు ఉష్ణాన్ని పెంచి కఫాన్ని తగ్గిస్తాయి.

డా.ఎస్.ప్రతిభ

సంబంధిత వార్తలు

బాలా త్రిపురసుందరిగా అమ్మవారు

నేటి నుంచే.. తీరొక్కపూల బతకమ్మ

loader