Asianet News TeluguAsianet News Telugu

బాలా త్రిపురసుందరిగా అమ్మవారు

ఈ రోజు అమ్మవారు గులాబిరంగు చీరలో మనకు దర్శనమిస్తుంది. అమ్మవారికి ఈ రోజు నైవేద్యం కట్టె పొంగలి. ఇందులో వాడబడే పదార్థాలు నెయ్యి, పెసరపప్పు, బియ్యం. అన్నం బలాన్నిస్తుంది. శరీర కాంతిని పెంపొందిస్తుంది. ఇక పెసరపప్పు త్రిదోషహారి. ఆకలిపుట్టి స్తుంది. నరాలకు బలాన్నిస్తుంది. తేలికగా జీర్ణం అవుతుంది. మిరియాలు జీలకర్ర ఆహారం తేలికగా జీర్ణం కావడానికి ఉపయోగపడతాయి.

dasara special.. balatripura sundari avataram
Author
Hyderabad, First Published Oct 10, 2018, 11:57 AM IST

హ్రీంకారాసన గర్భితా నల శిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం

సౌవర్ణాంబర ధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్జ్వలామ్‌

వందే పుస్తక పాశమంకుశ ధరాం స్రగ్భూషితా ముజ్జ్వలాం

త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణీం

అమ్మవారి రూపాల్లో మొదిరోజు బాలా త్రిపురసుందరి అలంకారం విశేషంగా చెప్పబడింది. బాల అంటే చిన్నపిల్ల అని అర్థం. అమ్మవారు మొదట మన ఇంట్లో  చిన్నపిల్ల రూపంలో వస్తుంది. మన ఇంట్లో  చిన్నపిల్లలు అమ్మవారి బాలాత్రిపురసుందరి ప్రతిరూపాలే. ఈ రోజున అమ్మను కొలిచి ఆమెను ధ్యానిస్తే మన సంతానం ఏ ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా, ఉన్నతంగా తీర్చిదిద్దబడతారు. నిర్మలమైన మనస్సుకు నిత్య సంతోషానికి గుర్తులు చిన్నపిల్లలు. బాల్యం దైవత్వంతో సమానమని నిరూపిస్తారు. ఈ బాల రూపం తర్వాతనే వేరు వేరు థలు వేరు వేరు రూపాలు అన్నీ వస్తాయి. సంతానం లేని వారికి సంతాన సౌభాగ్యం లభిస్తుంది.

అందరిలోను దైవాన్ని చూసే భారతీయ సంప్రదాయంలో స్త్రీ శిశువులలో దైవత్వాన్ని ఆపాదించి పూజించే సంప్రదాయం  ఈ నవరాత్రుల ప్రారంభం రోజులో మనకు కన్పిస్తుంది. అతి తీవ్రమైన శక్తిని ఒకేసారి ఉపాసించడం కాకుండా క్రమానుగతికంగా  చిన్న శక్తినుంచి పెద్ద శక్తివరకు కొలిచే ఈ నవరాత్రి ఉత్సవాలలో బాలాత్రిపురసుందరి ఆరాధన మొది ఆరాధన అవుతుంది.

భారతదేశంలోని మహిమాన్వితమైన అష్టాథ శక్తిపీఠాలు :

పూర్వం శక్తి స్వరూపమైన సతీదేవి మృతదేహం శివుడు ఎత్తుకుని తిరుగుతున్నప్పుడు ఆమె శరీరాన్ని విష్ణుచక్రం ముక్కలు చేస్తే ప్రధాన శరీర భాగాలు పడిన 18 ప్రదేశాలు అష్టాథ శక్తిపీఠాలుగా కీర్తిని పొందినాయి. అయితే ఇవి ప్రకృతి శక్తి బహిర్గతం కావడానికి కీలక స్థానాలేమో వైజ్ఞానికులు ఒక్కసారి పరీక్షిస్తే బావుంటుంది.

అవి : 1. లంక - శాంకరీ దేవి 2. కంచి - కామాక్షి 3. క్రౌంచపురం - చాముండి 4. అలంపూర్‌ - జోగులాంబ 5. శ్రీశైలం -భ్రమరాంబ 6. కొల్హాపూర్‌ - మహాలక్ష్మి 7. మాహూర్‌ - ఏకవీర 8. ఉజ్జయిని - మహాకాళి 9. పిఠాపురం - పురహూతిక 10. ఒరిస్సా - గిరిజాదేవి 11 ద్రాక్షారామం - మాణిక్యాంబ 12. గౌహతి - కామరూపిణి 13. ప్రయాగ - మాధవేశ్వరి 14. జ్వాలాముఖి - వైష్ణవీ దేవి 15. గయ - మంగళ గౌరి 16. కాశి - విశాలాక్షి 17. కాశ్మీర్‌ - సరస్వతి 18. బెంగాల్‌ -శృంఖలాదేవి. 

త్రిశక్తి  దేవాలయం యాదాద్రిజిల్లా వలిగొండలో ఈ రోజున  విశేషంగా  బాలలను ''బాలాత్రిపుర సుందరులు''గా భావించి ''బాలపూజ'' నిర్వహిస్తున్నారు. ఈ దేవస్థానంలో విశేషంగా నిర్వహించే కార్యక్రమం.

ఈ రోజు అమ్మవారు గులాబిరంగు చీరలో మనకు దర్శనమిస్తుంది. అమ్మవారికి ఈ రోజు నైవేద్యం కట్టె పొంగలి. ఇందులో వాడబడే పదార్థాలు నెయ్యి, పెసరపప్పు, బియ్యం. అన్నం బలాన్నిస్తుంది. శరీర కాంతిని పెంపొందిస్తుంది. ఇక పెసరపప్పు త్రిదోషహారి. ఆకలిపుట్టి స్తుంది. నరాలకు బలాన్నిస్తుంది. తేలికగా జీర్ణం అవుతుంది. మిరియాలు జీలకర్ర ఆహారం తేలికగా జీర్ణం కావడానికి ఉపయోగపడతాయి.

డా.ఎస్.ప్రతిభ

ఇవి కూడా చదవండి

నేటి నుంచే.. తీరొక్కపూల బతకమ్మ

Follow Us:
Download App:
  • android
  • ios