12 రాశుల వారికి రాశిఫలాలు ఈ దిన ఫలాలు 05.05.2025 సోమవారానికి సంబంధించినవి.
మేషం: ఈ రాశివారు ఇంట్లో కొన్ని ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల సమస్యల నుండి బయటపడుతారు. అలా చేయడం వల్ల కష్టమైన పనులు నుంచి కూడా సులభం చేయగలరు. పిల్లల కెరీర్ సంబంధించిన ఆందోళనలు ఉండవచ్చు. రాబోయే రోజుల్లో పరిస్థితి అనుకూలంగా మారుతాయి.
వృషభం: ఆచరణాత్మకంగా ఉండండి. భావోద్వేగాలకు లోనైతే తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మీ కృషే మీ లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడుతుంది. బంధువుల ఇంట్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. లేకపోతే వివాదాలు తలెత్తవచ్చు.
మిథునం: వీరు సామాజిక కార్యక్రమాలలో ముందుంటారు. స్నేహితులతో, బంధువులతో సంబంధాలు బలపడతాయి. కానీ, వ్యక్తిగత సమస్యల కారణంగా తోబుట్టువులతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది.
కర్కాటకం: మీరు రాజకీయ, సామాజిక సంబంధాలు ప్రయోజనకరంగా ఉంటారు. కాబట్టి మీ పరిచయాలను మెరుగుపరుచుకోండి. గతంలో జరిగిన విషయాలను వర్తమానంపై ప్రభావం చూపనివ్వకండి. ఇది సమస్యలకు దారితీయవచ్చు.
సింహం: వీరు వ్యక్తిగత సంబంధాలను గౌరవిస్తారు. కుటుంబ అవసరాల పట్ల కూడా శ్రద్ధ చూపుతారు. నేడు మీరు ప్రత్యేక వ్యక్తితో సమావేశమవుతారు. అయితే.. ప్రస్తుత పరిస్థితి అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఓపికగా ఉండండి.
కన్య: మీ పిల్లల చదువులకు సంబంధించిన ప్రణాళికలు ఫలిస్తాయి. మీ ప్రవర్తన ఇంట్లో అపార్థాలకు దారితీయవచ్చు. వాహన రుణం తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి. మార్కెట్లో మీ పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి.
తుల: మీ పని పట్ల మీరు చాలా శ్రద్ధగా ఉంటారు. మహిళలు తమ ఇంటి పనులను సులభంగా పూర్తి చేస్తారు. మీ కోరికల కారణంగా మీరు ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు. ఇంట్లో పెద్దలతో గౌరవంగా ప్రవర్తించండి. వ్యాపార రంగంలో ఉన్న సమస్యకు కొంతవరకు పరిష్కారం లభిస్తుంది.
వృశ్చికం: ఇంట్లో కొత్త వస్తువులు లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయవచ్చు. పెట్టుబడులకు సంబంధించిన పనులు పూర్తవుతాయి. ధైర్య సాహసాలతో మీరు కష్టతరమైన పనులను కూడా పూర్తి చేయగలుగుతారు. సన్నిహితులకు సంబంధించిన వార్తలు బాధ కలిగించవచ్చు.
ధనుస్సు: ఈరోజు ఒక పెద్ద సమస్యకు పరిష్కారం కనిపెడుతారు. ఇది మీకు మనశ్శాంతి లభిస్తుంది. ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారు. ఇతరుల విషయాల్లో అనవసరమైన సలహాలు ఇవ్వకండి. అలా చేస్తే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. అతిగా అహంకారం పనికిరాదు.
మకరం: రోజు మొదటి భాగంలో చాలా పనులు పూర్తవుతాయి. పెట్టుబడి పెట్టిన డబ్బు తిరిగి వస్తుంది. ఇష్టమైన బహుమతి దొరుకుతుంది. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది. చెడు వార్తలు వినాల్సి రావచ్చు. కుటుంబ సభ్యులతో పదే పదే వాదించడం వల్ల సంబంధాలు చెడిపోవచ్చు.
కుంభం: ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలల్లో పాల్గొంటారు. బ్యాంకు లేదా పెట్టుబడులకు సంబంధించిన పనుల్లో కష్టం రావొచ్చు. ఓపిక, సంయమనంతో వ్యవహరించండి. కృషి చేస్తే మీరు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు.
మీనం: ఈరోజు మీరు అనుకున్న పనులు అవుతాయి. ఆత్మపరిశీలన ద్వారా మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోండి. ఆర్థిక విషయాల్లో సమయం అంత అనుకూలంగా లేదు. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. మీ సామర్థ్యానికి తగ్గట్టుగా పనిచేయండి.


