ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 05.03.2025 బుధవారానికి సంబంధించినవి.
మేష రాశి ఫలాలు
నిరుద్యోగాలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో లోటుపాట్లు సరిచేసుకుంటారు. ఆర్థిక పురోగతి ఉంటుంది. కొన్ని పనులు పూర్తి అవుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు.
వృషభ రాశి ఫలాలు
దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. కొందరి మాటలు గొడవలకు దారితీస్తాయి. ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు జరుగుతాయి.
మిధున రాశి ఫలాలు
ఆప్తులతో మనస్పర్థలు వస్తాయి. పనులు మందకొడిగా సాగుతాయి. మానసిక సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో నిరాశ కలుగుతుంది. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో విమర్శలు పెరుగుతాయి.
కర్కాటక రాశి ఫలాలు
ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది.
సింహ రాశి ఫలాలు
ప్రముఖలతో పరిచయాలు పెద్దగా కలసిరావు. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు తెప్పిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో శ్రమకు తగ్గ గుర్తింపు దక్కదు. వృధా ఖర్చులు పెరిగిపోతాయి. ఆర్థికంగా ఇబ్బంది తప్పదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్య రాశి ఫలాలు
దైవ కార్యక్రమాలకు నగదు ఇస్తారు. స్ధిరాస్తి కొనుగోలు, అమ్మకాలు లాభసాటిగా ఉంటాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాల్లో మెరుగైన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ సభ సమావేశలకు హాజరవుతారు.
తుల రాశి ఫలాలు
కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు అతికష్టం మీద పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. స్థిరస్తి సంభందిత విషయాల్లో గొడవలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనలు అంతగా కలసిరావు.
వృశ్చిక రాశి ఫలాలు
బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. అనుకూల వాతావరణం ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పదోన్నతులు దక్కుతాయి. వ్యాపార వ్యవహారాల్లో అంచనాలను అందుకుంటారు. ఆర్ధిక ఇబ్బందుల నుంచి ఉపశమనం దక్కుతుంది.
ధనస్సు రాశి ఫలాలు
వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు కలిసివస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు.
మకర రాశి ఫలాలు
తొందరపాటు పనికి రాదు. ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో చికాకు తప్పదు. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు దక్కవు. బంధువులతో మనస్పర్థలు వస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
కుంభ రాశి ఫలాలు
ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కొన్ని పనులు అనుకున్న టైంకి పూర్తికావు. ఖర్చులు పెరిగిపోతాయి. ఉద్యోగంలో అనుకోని మార్పులు జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
మీన రాశి ఫలాలు
వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు అనుకూలం. పలుకుబడి పెరుగుతుంది. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో సమస్యలు తొలగిపోతాయి. వివాదాల నుంచి ఉపశమనం దక్కుతుంది.
