Today Rasi Phalalu: ఈ రాశి వారికి ఊహించని ధన లాభం..!
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 12.03.2025 గురువారానికి సంబంధించినవి.

మేష రాశి ఫలాలు
శుభవార్తలు వింటారు. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.
వృషభ రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలు అనుకూలం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో అనుకూలం. స్థిరమైన ఆలోచనలు ముందుకు సాగుతారు. వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి.
మిధున రాశి ఫలాలు
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో నిరాశ ఎదురవుతుంది. నిరుద్యోగులకు కలిసిరాదు. ఆర్థిక విషయాల్లో మిత్రులతో విబేధాలు వస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు నెమ్మదిస్తాయి.
కర్కాటక రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సహకాలు అందుతాయి. భూ క్రయ, విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆప్తుల నుంచి సాయం అందుతుంది. వ్యాపారంలో నష్టాలు భర్తీ అవుతాయి.
సింహ రాశి ఫలాలు
ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది. బంధు, మిత్రుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. పిల్లల చదువు బాగుంటుంది. స్థిరాస్తి వివాదాలు తొలగిపోతాయి. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.
కన్య రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టడం మంచిది. మిత్రుల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొందరి ప్రవర్తన మానసికంగా ఇబ్బంది పెడుతుంది. వ్యాపారాలు అంతగా సాగవు. ఆర్థిక విషయాలు చికాకు తెప్పిస్తాయి. భాగస్వామితో మనస్పర్థలు వస్తాయి.
తుల రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలు అంతగా సాగవు. పాత రుణాలు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో వ్యతిరేక వాతావరణం ఉంటుంది. ఒత్తిడి పెరుగుతుంది. వృథా ఖర్చులు పెరిగిపోతాయి.
వృశ్చిక రాశి ఫలాలు
ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు అనుకూలం. వివాదాల నుంచి బయట పడతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు.
ధనస్సు రాశి ఫలాలు
ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు పనికిరాదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగంలో విలువైన డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంటా, బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
మకర రాశి ఫలాలు
ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగాల్లో స్థిరమైన ఆలోచనలు కలిసివస్తాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
కుంభ రాశి ఫలాలు
నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. పనులు మందకొడిగా సాగుతాయి. దైవ దర్శనం చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు చాలా కష్టంగా సాగుతాయి. ఉద్యోగంలో ప్రతిభకు తగ్గ గుర్తింపు దక్కదు.
మీన రాశి ఫలాలు
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు తొలగిపోతాయి.

