Today Rasi Phalalu: ఈ రాశుల వారికి తిరుగేలేదు..! శత్రువు కూడా మిత్రుడవుతాడు..
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 12.03.2025 బుధవారానికి సంబంధించినవి.

మేష రాశి ఫలాలు
దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
వృషభ రాశి ఫలాలు
ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. పనులు సకాలంలో పూర్తి కావు. కొందరి ప్రవర్తన చికాకు తెప్పిస్తుంది. ఆర్ధికంగా నిరాశ ఎదురవుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో జాగ్రత్తగా ఉండాలి.
మిధున రాశి ఫలాలు
బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలం. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్త్రీ సంబంధ వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. వ్యాపారంలో స్వల్ప వివాదాలు వస్తాయి.
కర్కాటక రాశి ఫలాలు
కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
సింహ రాశి ఫలాలు
ముఖ్యమైన పనుల్లో తొందరపాటు మంచిది కాదు. వ్యాపారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. నిరుద్యోగులకు కొంత అనుకూలం. దైవ కార్యక్రమాలకు డబ్బు ఖర్చు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు.
కన్య రాశి ఫలాలు
దైవ సేవ పట్ల ఆసక్తి పెరుగుతుంది. టైంకి తిండి, నిద్రా ఉండవు. వ్యాపారంలో అనుకూలం. డబ్బు విషయంలో ఆలోచించి ముందుకు వెళ్లాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
తుల రాశి ఫలాలు
వ్యాపారం నెమ్మదిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అప్రమత్తత అవసరం. కొత్తగా పనులు మొదలు పెట్టకపోవడమే మంచిది. జీవిత భాగస్వామితో అకారణంగా మాటపట్టింపులు వస్తాయి. అన్నదమ్ములతో స్వల్ప వివాదాలు వస్తాయి. మీ మాటకు విలువ తగ్గుతుంది.
వృశ్చిక రాశి ఫలాలు
నిరుద్యోగులకు అంతంతమాత్రమే. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు అననుకూలం. వృధా ఖర్చులు విషయంలో జాగ్రత్త అవసరం. కంటి సంబంధిత సమస్యలు బాధిస్తాయి.
ధనస్సు రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు ఉంటాయి. ఆశించిన ధన సహాయం అందుతుంది. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు వస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి.
మకర రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని సమస్యలు వస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. డబ్బు పరంగా ఒడిదుడుకులు ఎక్కువవుతాయి. అప్పుల ఒత్తిడి కొంత పెరుగుతుంది.
కుంభ రాశి ఫలాలు
అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆశించిన ధన సహాయం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సమస్యలు రాజీకొస్తాయి. ఉద్యోగంలో అనుకూలం.
మీన రాశి ఫలాలు
ఉద్యోగంలో వివాదాలకు వెళ్ళకపోవడమే మంచిది. వ్యాపారాల్లో కొత్త విధానాలు అమలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు అనుకూలం.

