Asianet News TeluguAsianet News Telugu

ఏ రాశివారికి ఏది మంచి రోజు

ఈ ముహూర్తంలో తారాబలం చాలా ముఖ్యమైనది. జరుగుతున్న కార్యక్రమాన్ని ఎవరెవరికి చూడాలి అనే విషయం కూడా తెలుస్తుంది. ఇది నిత్య జీవితంలో కూడా చాలా ఉపకరిస్తుంది.

astrology.. which is the good day for people
Author
Hyderabad, First Published Sep 15, 2018, 4:16 PM IST

వ్యక్తి పుట్టడం మరణించడం ఈ రెండు తమ చేతిలో లేని పనులు. పుట్టినప్పుడు ఉండే లగ్న, గ్రహ వ్యవస్థల ఆధారంగా ఆయా దశల్లో జరిగే శుభాశుభాలు వాటి   కి అనుగుణంగా తమ జీవితాన్ని  జాగ్రత్తగా మలుచుకునే విధానం జాతకం చెపుతుంది. జీవితంలో జరుపుకునే ముఖ్య సంఘటనలకు సంబంధించిన శుభమైన కాంతులు ప్రసరించే కాలాన్ని ఎన్నుకోవడం ద్వారా ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉంటే వాటిని తొలగింపబడి, ఆ కార్యక్రమం సఫలీకృతం అయి అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. ఆ యా కార్యక్రమాలకు అనుగుణంగా నక్షత్ర, గ్రహాల ఆధారంగా సమయాలను నిర్దేశించే విధానం ఉంటుంది. ఈ విధానాన్నే ముహూర్తం అంటారు.

ఈ ముహూర్తంలో తారాబలం చాలా ముఖ్యమైనది. జరుగుతున్న కార్యక్రమాన్ని ఎవరెవరికి చూడాలి అనే విషయం కూడా తెలుస్తుంది. ఇది నిత్య జీవితంలో కూడా చాలా ఉపకరిస్తుంది. ఏవైనా కొత్త పనులు ప్రారంభించడానికి వెళ్ళాలి అనుకునేవారు లేదా ఈ రోజు వారికి అనుకున్న పనులు పూర్తి అవుతాయా ఆటంకాలు వస్తాయా అని తెలుసుకోవాలి అని అనుకునేవారు ఎవరికి వారు తారాబలం చూసుకోవాలి.

పుట్టి నప్పుడు ఒక నక్షత్రం చెపుతారు. అది వ్యక్తి నక్షత్రం అవుతుంది. ఏ పని చేయాలన్నా ఆ నక్షత్రాన్ని ఆధారం చేసుకునే తారాబలం చూసుకోవాలి. దీనినే నిత్యగోచారం అని కూడా అంటారు.

తమ జన్మ నక్షత్రం నుండి ఆ రోజు నక్షత్రం వరకు లెక్కించి దానిని 9చేత భాగించాలి. శేషం వేరు వేరు తారలుగా లెక్కించి ఫలిత నిరూపణ చేయాలి.అవి శేషం1 వస్తే జన్మతార, శేషం 2 వస్తే సంపత్‌ తార, శేషం 3 వస్తే విపత్తార, శేషం 4 వస్తే క్షేమ తార, శేషం 5 వస్తే ప్రత్యక్తార, శేషం 6 వస్తే సాధనతార, శేషం 7 వస్తే నైధన తార, శేషం 8 వస్తే మిత్ర తార, శేషం 9 వస్తే పరమ మిత్ర తారలు అవుతాయి. వీనిలో 2వతార, 4వ తార, 6వ తార, 8 వతార, 9వ తార శేషం వస్తే శ్రేష్ఠంగా చెపుతారు.

ఈ రోజు హస్త నక్షత్రం. ఇదే నక్షత్రం జన్మ నక్షత్రంగా ఉన్న వారికి హస్త నక్షత్రంరోజు ఏదైనా కార్యం చేయాలనుకుంటే నిత్యగోచారం చూస్తే తారాబలం ఎలా ఉంటుందో గమనిద్దాం. హస్త నక్షత్రం నుంచి హస్త నక్షత్రం వరకు లెక్కపెడితే 28 నక్షత్రాలు అవుతాయి. 28ను 9తో భాగిస్తే 1 శేషం వస్తుంది. 1 శేషం వస్తే 1వతార జన్మతార అవుతుంది.

1. జన్మతార : ఈ రోజు ఏదైనా పనులు ప్రారంభించాలంటే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈరోజు మనస్తాపం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి  కొత్త పనులు ప్రారంభించకుండా ఉండడం మంచిది.

2. సంపత్తార : సంపత్తార అన్నిరకాల అనుకూలమైన తార. ఈరోజు అన్నిరకాల లావాదేవీలకు మంచిది. సంపద అంటే డబ్బు ఒకటే కాదు, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, వీటన్నినీ కూడా సంపదలుగానే భావించాలి. ఇవి అన్నీ ఉంటే సంపద నిండుగా ఉన్నదని అర్థం.

3. విపత్తార : విపత్తు అంటే ఆటంకాలను, కష్టాలను కలిగించేది. చేసే అన్ని పనుల్లో కూడా కష్టాలు ఎక్కువ, మొదలు పెట్టి న పని పూర్తి కాకుండా అన్నీ ఆటంకాలు, ప్లోటాటలు కూడా వస్తూ ఉంటాయి. చేసే పని మీద విసుగు, చికాకు వస్తాయి. కాబట్టి  విపత్తార పనికిరాదు.

4. క్షేమతార : ఈ రోజు పనులు సజావుగా సాఫీగా సాగుతాయి. అంటే ప్రయాణాలు చేసేవారికి శుభ సూచకంగా కూడా చెప్పవచ్చు. క్షేమంగా వెళ్లి లాభంగా రండి అని దీవిస్తారు కదా. చేసే అన్ని పనుల్లో సంతోషం, క్షేమం కార్య అనుకూలత కలుగుతాయి.

5. ప్రతక్తార : ప్రత్యక్‌ అంటే కార్య నాశనము అని అర్థం. మొదలు పెట్టిన పనిలో కార్యనాశనం చూపిస్తుంది. రోజూవారి చేసుకునే పనుల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆరోజు ఏదైనా పనిపై బయటకు వెళ్ళడం లాంటి   వి చేయకూడదు.

6. సాధనతార : ఈ తార పేరులోనే సాధనం అని ఉంది. కాబట్టి  ఈరోజు అన్ని రకాల పనులను ప్రారంభించవచ్చు. ఏ పని మొదలు పెట్టి న అందులో విజయాన్ని సాధిస్తారు. ఫలితం కూడా సంతోషంగా ఉంటుంది. పని పూర్తి చేసి ఆనందాన్ని పొందుతారు.

7. నైధనతార : నైధన తార పనికి రాదు. అంటే ఈరోజున చేసే పనుల్లో చాలారకాల కష్టాలు అనుభవించాలి. చేసే పనుల్లో ఆటంకాలు, కష్టాలు ఎక్కువ. మరణ తుల్యమైన భావనను కూడా కలిగిస్తుంది. కాబట్టి  ఈరోజున ఎక్కువగా దానాలు చేసుకోవడం మంచిది.

8. మిత్రతార : మిత్రతారలో మొదలు పెడితే పనులు సజావుగా సాగుతాయి. చేసే పనివల్ల ఏదో ఒకరకమైన సుఖ  సంతోషాలు కలుగుతాయి. కాబట్టి  మిత్ర తార శ్రేష్ఠమైనది.

9. పరమమైత్రతార : ఈ రోజున కూడా చేసే పనుల్లో ధనలాభాన్ని కలిగిస్తాయి. అనుకున్న పనులు పూర్తిచేసుకునే సమయం ఉంటుంది. కాబట్టి  ఈ తారకూడా మంచి ఫలితాలనే ఇస్తుంది.

ఈ విధంగా ప్రతిరోజూ ఎవరికి వారు తాము ఏవైనా చిన్న చిన్న పనులు మొదలుప్టోలంటే పంచాంగం లేదా క్యాలెండర్‌ చూసుకుని తమకు తాము మంచి చెడు రోజులను నిర్ణయించుకోవడానికి వీలుంటుంది.

డా|| ఎస్‌. ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios