Asianet News TeluguAsianet News Telugu

యోగాసనాలు - ఉపయోగాలు

మెడ, వీపునొప్పులు, చేతి నరాల బలహీనత, ఆయాసం లాంటి  వ్యాధులలో ఈ ఆసనం పనిచేస్తుంది.

astrology...uses of yoga
Author
Hyderabad, First Published Sep 25, 2018, 4:01 PM IST

1. గోముఖాసనం వలన ఉపయోగాలు : 1. మూత్రం అతిగా వెలువడడం, ధాతు నీరసం, లికోరియా, మధుమేహం, ఊపిరితిత్తులు, మెడ, వీపునొప్పులు, చేతి నరాల బలహీనత, ఆయాసం లాటి ం వ్యాధులలో ఈ ఆసనం పనిచేస్తుంది.

2. నర్వస్‌ సిస్టం యొక్క నీరసాన్ని తగ్గించి మనస్సుకి స్థిరత్వాన్నిస్తుంది.

3. అవసరం లేని అండకోశం పెరుగుదలను ఆపుతుంది.

5. తొడలు, పిక్కలు, సీవనానాడి, కిప్రదేశం, కంఠం, భుజాలు, హృదయ వ్యాధులన్నిని పోగొడుతుంది. ఛాతీ వెడల్పుగా తయారవుతుంది.

2. స్వస్తికాసనం వలన ఉపయోగాలు : 1. రొమ్ము, హృదయం, దానిలోనికి వచ్చిపోయే పెద్ద రక్తనాళాలు, ఊపిరితిత్తులు, వాయుమార్గాలతోబాటు ఆహారనాళం కూడా చురుకుగా ఉంటుంది.

2. వీపు కింది నరాలు లాగబడటం వలన ఆరోగ్యవంతంగా ఉంట్టాయి.

3. చలికాలంలో చల్లబడిపోయే పాదాలు వెచ్చగా ఉంట్టాయి. అలాగే వేసవిలో అతిగా పట్టే చెమట కూడా తగ్గుతుంది.

4. కాళ్ళ నొప్పులు తగ్గుతాయి.

3. సింహాసనం వలన ఉపయోగాలు : 1.ట్టాన్సిల్సు, నత్తి విం కంఠ దోషాలు తగ్గుతాయి.

2. కళ్ళు, ముక్కు, చెవులు బాగుపడతాయి.

3. శుక్రగ్రంథి ప్రభావానికి లోనవటం వలన వీర్యం సురక్షితంగా ఉంటుంది.

4. మూడు బంధాలూ ఉడియాన బంధం, మూలబంధం, జలంధర బంధాలను వేయగలిగే శక్తి లభిస్తుంది.

4. మయూరాసనం వలన ఉపయోగాలు : 1. జీర్ణ మండలంలోని అవయవాలన్నీ బాగు పడతాయి. అన్నాశయంతోపాటు పేగులు కూడా ధృడంగాను చురుకుగాను తయారవుతాయి. ఆకలి పెరుగుతుంది. బాన కడుపు తగ్గుతుంది.

2. మణికట్టు, భుజాలు, ఊపిరితిత్తులు, కండరాలు, హృదయం బలాన్ని సంతరించు కుట్టాంయి.

3. వాత పిత్త కఫ దోషాలు దూరమవుతాయి.

4. కడుపులోని నులి పురుగులు నశిస్తాయి.

5. రక్తం శుభ్రపడుతుంది. శరీరంలో తేజస్సు కాంతి చురుకుదం ఇంజెక్షన్‌ ఇచ్చినట్లు పనిచేస్తాయి.

5. పద్మాసనం వలన ఉపయోగాలు : పద్మాసనంలో శరీరం స్థిరంగా ఉంటుంది. ఎక్కువసేపు కూర్చోవడం వలన కాళ్ళలో రక్త ప్రసరణ తగ్గి మిగిలిన రక్తం మెదడుకు చేరి ధ్యానానికి ఉపయోగపడుతుంది.

వెన్నముక సహజంగా ఈ ఆసనంలో గ్టి పడుతుంది. రక్తప్రసరణ వ్యవస్థ సరిగా పనిచేస్తుంది. నాడీమండలం బాగుపడుతుంది.

రెండుకాళ్ళు అరిపాదాలు పైకి ఉండడం వలన రెండు చేతులూ జ్ఞాన ముద్రలో ముడుకుల పైన ఉండటం వలన కాళ్ళు పంజాలు వేళ్ళ కణుపుల నుండి బైటకు పోయే విద్యుచ్ఛక్తి బైటి కి పోక శక్తి అంతా శరీరంలోనే ఉంటుంది.

నాభికి ఎడమవైపున ఉన్న సరస్వతీనాడి ఎడమ మడమతో నొక్కబడినందువలన సుషుమ్న నుండి ప్రాణ ప్రవాహం ఆరంభం అవుతుంది. నాసాగ్ర భాగాన గాని కనుబొమల మధ్య కేంద్రీకరించిన ధ్యానం వలన కాని సరియైన స్థితిలో ఉత్పన్నం అవుతుంది.

కాళ్ళకు సంబంధించిన వ్యాధులన్నీ దూరమౌతాయి. సయాటి కా, వాతరోగాల బాధ తగ్గుతాయి.

మడమ కడుపులో పెట్టడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది.

మనసు త్వరగా ఏకాగ్రతను పొందుతుంది. దానివలన ధ్యానంలో ఎక్కువసేపు ఉండవచ్చు.

పద్మాసనంలో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ విశ్రాంతిని పొందుతాయి. దాని వలన వాటి  శక్తి మిగులుతుంది

ఈ ఆసనాలు చేయడం వలన ఎవరికి వారు స్వతంత్రంగా జీవిస్తూ ఆనందంగా కాలాన్ని గడుపుతారు. ఒకరిపై ఆధారపడే అవసరం లేకుండా ఉంటుంది. మనిషి బ్రతికినంతకాలం స్వతంత్రంగా ఉండాలి కాని ఎప్పుడూ ఏదో అనారోగ్యంతో బాధపడుతూ ఉండి తను బాధపడుతూ తన చుట్టూ ఉన్నవారిని బాధపెట్టడం తమ లక్ష్యం కాకూడదు. ఈ భావనను అర్థం చేసుకునేవారు ప్రతి ఒక్కరూ ప్రతి నిత్యం యోగాసనాలు వేయవలసిందే.

డా.ఎస్ ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios