Asianet News TeluguAsianet News Telugu

జోతిష్యశాస్త్రం ప్రకారం ఇలా చేస్తే.. దంపతుల రొమాంటిక్ లైఫ్ బాగుంటుంది..!

ఇలా చేయడం వల్ల.. కుటుంబంలోని చెడు దృష్టిని దూరం చేస్తుంది. అంతేకాదు.. ప్రతికూల శక్తిని కూడా దూరం చేస్తుంది. దాని వల్ల దంపతుల మధ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి.

Astrology Tips For Couple Romantic life
Author
Hyderabad, First Published Jan 12, 2022, 4:07 PM IST

భార్య భర్తల మధ్య గొడవలు రావడం చాలా సహజం. అయితే.. ఆ గొడవలు ఉదయం మొదలై.. రాత్రికి సద్దుమణిగిపోతాయి. కానీ కొన్నిసార్లు ఆ గొడవలు పెద్దగా మారి.. ఇంట్లో మనశ్శాంతి కోల్పోతాం. అంతేకాదు.. దపంతుల మధ్య దూరం కూడా పెరిగిపోతుంది. అంత దూరం పెరిగాక.. వారి మధ్య సెక్స్ లైఫ్ కూడా దూరమౌతుంది. అయితే.. ఇలాంటి సమస్యలు రాకుండా.. సెక్స్ లైఫ్ బాగుండాలంటే.. జోతిష్యశాస్త్రం ప్రకారం.. మహిళలు.. కొన్ని పనులు  చేస్తే.. వారి దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుందట. మరి అవేంటో ఓసారి చూద్దామా..

మహిళలకు.. వంటగదికి విడదీయరాని బంధం ఉంటుంది.  కాబట్టి.. ఈ వంటగదిలో రాత్రి వంట చేయడానికి ముందు.. స్టవ్ పై కొద్దిగా పాలు చిలకరించాలి. ఇలా చేయడం వల్ల.. కుటుంబంలోని చెడు దృష్టిని దూరం చేస్తుంది. అంతేకాదు.. ప్రతికూల శక్తిని కూడా దూరం చేస్తుంది. దాని వల్ల దంపతుల మధ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి.

ఇక.. రాత్రిపూట భోజనాల తర్వాత.. వంట గదిని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రం చేయకపోతే.. ఆ కుటుంబంపై రాహువు చెడు ప్రభావం పడుతుంది. తర్వాత శుభ్రం చేసుకుందాములే అని..  వదిలేయకూడదు. వైవాహిక జీవితంలో.. సమస్యలు ఎదురౌతాయి. అంతేకాదు.. వంట గది శుభ్రం గా లేకపోతే.. లక్ష్మీ దేవి ఇంట్లో ఉండటానికి ఇష్టపడదట.

అంతేకాకుండా.. రాత్రి పూట మంచం కింద.. గాజు సీసాలో... తేనెను భద్రపరచాలి. ఎవరికీ కనపడకుండా..  దంపతుల మధ్య రొమాంటిక్ లైఫ్ అందంగా మారుతుందట.

దీపం వెలిగించండి
రాత్రి పడుకునే ముందు ఇంటికి పడమర లేదా దక్షిణ దిశలో దీపం వెలిగించాలి. ఇది సానుకూల కోణాన్ని పెంచడమే కాకుండా శృంగార భావాన్ని కూడా సృష్టిస్తుంది.

అంతేకాకుండా.. రాత్రిపూట భోజనం చేసిన తర్వాత.. రాత్రి పడుకునే ముందు.. పడక గదిలో కర్పూరం వెలిగించాలి. దీని సువాసన మనసుకు హాయిగా అనిపించడంతోపాటు.. ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఇది టెన్షన్‌ని తగ్గిస్తుంది. శ్రావ్యమైన క్షణాలు అవాంతరాలు లేకుండా మీ సొంతమవుతాయి. ఆ విధంగా మీరు శృంగార రాత్రులు గడపవచ్చు. భార్యాభర్తల సంబంధంలో ప్రతికూల అంశాలు ఉంటే ప్రతిరోజూ ఇలా చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల హాయిగా నిద్ర కూడా పడుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios