ఈ వారం( సెప్టెంబర్14 నుంచి సెప్టెంబర్ 20వరకు) రాశిఫలాలు ఇలా ఉన్నాయి
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : నూతన పరిచయాల వల్ల అనుకూలతలు. భాగస్వాములు అప్రమత్తత అవసరం. అనుకోని ఆదాయం వస్తుంది. పదిమందిలో గౌరవంకోసం ఆరాటం. ఊహించని ఇబ్బందులు వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త పడాలి. క్రయ విక్రయాల్లో ఒత్తిడులు. పరామర్శలు చేస్తారు. విద్యార్థులకు కష్టకాలం. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. అన్ని రకాల సౌకర్యాలు పొందుతారు. పనుల పూర్తికి పట్టుదల అవసరం. గణపతి ఆరాధన మంచిది. తెల్లి వస్త్రాలు, అన్నదానం, పులిహోర దానం చేయాలి.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : శ్రమాధిక్యం ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. గుర్తింపు లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. పదిమందిలో గౌరవం కోసం ఆరాటపడతారు. దూర ప్రయాణాలపై ఆసక్తి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. భాగస్వాములతో అప్రమత్తత. క్రయ విక్రయాల్లో లోపాలు. అనుకోని ఖర్చులు ఉంటాయి. విహారయాత్రలపై దృష్టి ఉంటుంది. భాగస్వాములతో జాగ్రత్త అవసరం. శ్రమలని సంపాదనపై దృష్టి పెడతారు. దత్తాత్రేయ ఆరాధన, లక్ష్మీ పూజ, గణపతి పూజ మంచిది. అన్నదానం, తెల్లి వస్త్రాల దాన తప్పనిసరి.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : మానసిక ప్రశాంతత ఉంటుంది. సంతాన ఆలోచనల్లో ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులకు కొంత ఒత్తిడి. పరిపాలన సమర్ధతను కలిగి ఉంటాయి. ఆత్మీయులకై ఆలోచిస్తారు. శారీరక శ్రమ ఉంటుంది. పోటీ ల్లో గెలుపై ఆలోచన. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నూతన పరిచయాల వల్ల అనుకూలత ఉంటుంది. పదిమందిలో గౌరవం లభిస్తుంది. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. దాన ధర్మాలు చేయడం మంచిది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచి ఫలితాలిస్తుంది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సౌకర్యాలకోసం ఆరాట పడతారు. ఒత్తిడితో సౌకర్యాలు పూర్తి. విద్యార్థులకు ఒత్తిడి కాలం.సృజనాత్మకతను కోల్పోతారు. ఆత్మీయ అనురాగాలకై పరితపిస్తారు. ఒత్తిడి అధికంగా పెంచుకుటాంరు. శ్రమాధిక్యం గుర్తింపు లభిస్తుంది. శారీరక బలం పెంచుకుటాంరు. దగ్గరివారితో కలహాలు వచ్చే సూచన. చిత్త చాంచల్యం పెరుగుతుంది. వ్యాయామం తప్పనిసరి. అధికారులతో అనుకూలత ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచి ఫలితాలిస్తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) :స్త్రీల సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్ అనుకూలిస్తాయి. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. సహాధ్యాయులతో అనుకూలత ఉంటుంది. పరామర్శలు చేస్తారు. ఒత్తిడితో సౌకర్యాలు లభిస్తాయి. విద్యార్థులకు కష్టకాలం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆహారంలో సమయం పాటి ంచాలి. మానసిక ప్రశాంతతను ఏర్పరచుకోవాలి. సృజనాత్మకతను కోల్పోతారు. చిత్త చాంచల్యం అధికం. కళలపై ఆసక్తి తగ్గుతుంది. సుంగధద్రవ్యాలపై ఆసక్తి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచి ఫలితాలిస్తుంది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. విహార యాత్రలపై దృష్టి. పాదాల నొప్పులు ఉంటాయి. ఊహల్లో విహరిస్తారు. చిన్న పనికి కూడా భయపడతారు. సమిష్టి ఆదాయాలకై ప్రయత్నం. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఉన్నతి లభిస్తుంది. సమిష్టి ఆదాయాలపై దృష్టి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. పెద్దలం గౌరవం ఉంటుంది. గణపతి ఆరాధన, లక్ష్మీ పూజ, శివారాధన మంచి ఫలితాలనిస్తాయి.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : శారీరక శ్రమ అధికం. శ్రమకు తగిన గుర్తింపు అంతగా లభించదు. గుర్తింపుకోసం ఆరాటపడతారు. పట్టుదలతో కార్యసాధన అవసరం. మాటల్లో జాగ్రత్త అవసరం. వాగ్దానాల వల్ల ఇబ్బందులు. మధ్యవర్తిత్వాలు ఇబ్బందికరం. స్త్రీల సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్ అనుకూలిస్తాయి. చిన్న ప్రయాణాలపై దృష్టి పెడతారు. ఆధ్యాత్మిక యాత్రలపై దృష్టి. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. పరామర్శలు చేస్తారు. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది. సహకారాన్ని అందించాలి
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : పాదాల నొప్పులు ఉంటాయి. మానసిక ఒత్తిడి అధికం. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. అనవసర ప్రయాణాలు చేస్తారు. ఊహల్లో జీవనం సాగిస్తారు. భయం ఎక్కువ. కార్యసాధనలో పట్టుదలఅవసరం. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకోవాలి. గుర్తింపు లభిస్తుంది. మృష్టాన్న భోజనంపై ఆలోచన ఉంటుంది. కష్టపడతారు. అనవసర ఇబ్బందులు ఖర్చులు చేస్తారు. మాటల వల్ల ఒత్తిడి అధికంగా ఉంటుంది. మౌనం వహించడం మంచిది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం అన్నివిధాలా మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : విహారయాత్రలపై దృష్టి ఉంటుంది. అనవసర ప్రయాణాలు చేస్తారు. విశ్రాంతి తక్కువగా ఉంటుంది. మానసిక ఒత్తిడి అధికం. శారీరక శ్రమ ఉంటుంది. గుర్తింపు ఉంటుంది. ఆలోచనల్లో మార్పులు. పట్టుదలతో కార్యసాధన. ఇతరులపై ఆధారపడతారు. స్త్రీల ద్వారా ఆదాయం లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సమిష్టి ఆదాయాలు వస్తాయి. సంఘ వ్యవహారాల్లో జోక్యం అధికం. అనవసర ఖర్చులు. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ఉద్యోగంలో ఉన్నతికోసం ఆలోచిస్తారు. బోనస్‌లు వచ్చే సూచన. తోటి ఉద్యోగులతో అనుకూలత ఉంటుంది. అధికారం అనుకూలంగా ఉంటుంది. సమిష్టి ఆదాయాలు వస్తాయి. కళలపై ఆసక్తి పెరుగుతుంది. ఆదర్శవంతమైన జీవితానికై ఆరాట పడతారు. ఉపాసనపై దృష్టి పెరుగుతుంది. తల్లి తరఫు బంధువులతో అనుకూలత పెరగుతుంది. విశ్రాంతికై ప్రయత్నిస్తారు. పాదాల నొప్పులు ఉంటాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. దానాలు చేయడం మంచిది. లక్ష్మీ పూజ, గణపతి పూజ మంచిది. అన్నదానం, తెల్లి వస్త్రాల దాన తప్పనిసరి.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విహారయాత్రలపై దృష్టి సారిస్తారు. ప్రయాణాల్లో ఆటంకాలు. విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. చేసే పనుల్లో ఆలోచనలు అవసరం. పరిశోధనల వల్ల కష్టకాలం. దూర దృష్టి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అధికారులతో అప్రమత్తత అవసరం. ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు వచ్చే సూచన. రాజకార్యాలపై దృష్టి ఉంటుంది. లక్ష్మీ పూజ, గణపతి పూజ మంచిది. అన్నదానం, తెల్లి వస్త్రాల దాన తప్పనిసరి.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఊహించనిఆటంకాలు వస్తాయి. పనుల్లో ఒత్తిడి అధికం. అనారోగ్య భావన ఉంటుంది. లాభనష్టాలు సమానం. దూర దృష్టి ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిడి అధికం. శుభకార్యాల్లో పాల్గొనే ఆలోచన చేస్తారు. చిత్త చాంచల్యం అధికం. ఉద్యోగస్తులకు కాస్త అనుకూల సమయం. అధికారులతో అప్రమత్తత అవసరం. సంఘంలో గౌరవం కోసం ఆరాటపడతారు. లభిస్తుంది. కీర్తి కాంక్ష అధికం అవుతుంది. ఇతరులపైజాలి, దయ ఉంటాయి. లక్ష్మీ పూజ, గణపతి పూజ మంచిది. అన్నదానం, తెల్లి వస్త్రాల దాన తప్పనిసరి.
డా.ప్రతిభ