కార్తీక శుద్ధ ద్వాదశి తెలుగువారికి పండుగ. ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు నిద్రనుండి మేల్కొని బృందావనంలోకి ప్రవేశిస్తాడని, అందువల్ల ఈ రోజు బృందావనంలో పూజ చేయడంఆచారంగా మారింది. దీనినే మథన ద్వాదశిగా చెప్తారు.  పాల సముద్రాన్ని మథించిన రోజునీ అందుకే మథన ద్వాదశిగా దీనికే మరోపేరు చిలుకు ద్వాదశి.

తులసిమొక్క హిందువులందరికీ ఆరాధ్యదైవం. తులసి మొక్క లేని హిందువులు ఉండరు. ప్రతీరోజు ఈ మొక్కకు నీరు పోసి, ఉదయ సాయంకాలాలలో దీపాలు వెలిగిస్తారు. ఈ తులసిలో మూడు రకాలు ఉన్నాయి. తెలపు, నలుపు, నీలం. తెలుపు తులసి లక్ష్మీ తులసి అనీ, నలుపు తులసి కృష్ణ తులసి అని, నీల తులసి రామ తులసి అని పేర్లున్నాయి. ఈ తులసి పూసలను జపమాలగాను, భక్తులు మెడలోనూ ధరిస్తారు. ఎప్పుడూ చర్మరోగాలు రాకుండా కాపాడుకుటాంరు.

తులసి సర్వరోగ నివారిణి. దీని ఆకులు, గింజలు, వేళ్ళు కొమ్మలు అన్నీ వైద్యానికి ఉపయోగపడతాయి. ఈ తులసి చెట్టు ఇంి ముందు వనంలా పెంచితే యమదూతలు రారని, దుర్గంధాన్ని రానీయకుండా కాపాడి, దోమలు దోమల వల్ల వచ్చే వ్యాధులను రాకుండా చేస్తుంది. రోజు కొన్ని తులసి దళాలు ఔషధంలా స్వీకరిస్తే విష జ్వరాలు లాింవి రాకుండా ఎప్పుడూ రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటారు. తులసి రసం చర్మవ్యాధులను, కడుపు ఉబ్బసాలను, మొండి దగ్గు, నీరసం రాకుండా కాపాడుతుంది. ఈ తులసి వేసవి కాలం చలువని, చలికాలం వేడిని కలిగిస్తుంది. తులసి కోటలోనే ఉసిరి కొమ్మను కూడా పెడతారు.

ఈ రోజున తులసి వివాహం చేస్తారు. శ్రీకృష్ణ విగ్రహం ప్టిె, తులసి కొమ్మకు వివాహం చేస్తారు. సాధారణ వివాహాలు ఎలా చేస్తారో, ఈ వివాహం అంత వైభవంగా చేస్తారు.ఇది సాయంకాలం సమయంలోనే చేస్తారు. మంగళాష్టకాలు చదివి, జిలకర బెల్లం తయారు చేసి, తెర అడ్డం ప్టిె చేస్తారు. ఈ సమయంలో సాయంకాలం ఇంిముందు శ్రీకృష్ణ పాదాలు వేస్తారు. శ్రీకృష్ణుడుతమ ఇంిలోకి వస్తాడని భావించి కృష్ణ పాదాలు వేసి ఆహ్వానిస్తారు. ఇది కూడా గోధూళి వేళ అనగా సాయంకాలం సమయంలో అనగా సూర్యాస్తమయ సమయంలో మాత్రమే వేస్తారు.

కొన్ని రోజుల క్రితం వరకు చైత్రమాసంలో శ్రీరామనవమి అయ్యాక అంటే రామ కల్యాణం అయిన తర్వాత ముహూర్తాలు పెట్టేవారు. కార్తీకంలో తులసి వివాహం అయిన తరువాత గాని వివాహ ముహూర్తాలు పెట్టేవారు కాదు. అంటే రామ నవమికి ఎంత ప్రాశస్త్యం ఉందో తులసి వివాహానికి కూడా అంత ప్రాశస్యం ఉంది. అంటే వివాహం చేయడం వల్ల వివాహ ఋతువుకి స్వాగతం పలుకుతున్నట్లు కూడా చెప్పవచ్చు. ఈరోజున బాణ సంచా కాలుస్తారు. ఇది తెలుగు, కర్ణాటక, మహారాష్ట్రల్లో జరుపుకుటాంరు. 

కృష్ణ భక్తులు ఈ వివాహాన్ని చాలా వైభవంగా జరుపుతారు. కృష్ణ మందిరాలు అన్నీ అందంగా అలంకరించి కొన్ని కొన్ని  మందిరాలలో అన్నీ పాలతో చేసిన ప్రసాదాలనే నైవేద్యంగా పెడతారు.

డా.ఎస్.ప్రతిభ

ఈ తులసి వ్రతాన్ని గురించి తులసి వివాహాన్ని గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఏవి ఎన్ని కథలు ప్రచారంలో ఉన్నా మన ప్రకృతిని కాపాడుకోవాలని, మన ఆచారాలు, సంప్రదాయాలను కాపాడలని చెప్పడమే అన్నిలోనూ ఉద్దేశం. ఆరోగ్యకరమైన మొక్కలను నాటుకుంటూ వాిని కాపాడుకుంటూ అనవసరంగా ఔషధాలు స్వీకరించకుండా ఎప్పుడూ ఆరోగ్యాన్ని కాపాడుకునేవారు పూర్వకాలం గృహస్తులు. మరల ఈ మధ్యకాలంలో ఆ విధానం ప్రారంభం అవుతుంది. ఈ సంతోషకరమైన మార్పును మనందరం స్వాగతించాలి....