తాను చేసే పనుల్లో ఒత్తిడిని ఎదుర్కుంటారు. పట్టుదలతో పనులు చేయాలి. మొదలు పెట్టిన పనులు మధ్యలోనే ఆపే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ శ్రమతో తక్కువ ఫలితాలు సాధిస్తారు. సమయానుగుణంగా ఆలోచనలు మార్చుకుంటూ కావలసిన పనులు నెరవేర్చుకోవాలి. అనవసర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగస్తులు వేరు వేరు ప్రాంతాలకు తిరిగే సూచనలు కనబడతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. అన్ని పనుల్లో ఒత్తిడులు ఉంటాయి. శ్రమ కూడా అధికంగా ఉంటుంది.

పెద్దల వారి సహాయ సహకారాలు అందుకునే ప్రయత్నం చేస్తారు. దగ్గరివరకు వచ్చి దూరమయ్యే సూచనలు ఉన్నాయి. బంధువర్గీయులతో ఆత్మీయతను పెంచుకునే ప్రయత్నం చేయాలి. సహకారం వల్ల ఒక్కోసారి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకొని నిలబడగలగాలి. విద్యార్థులకు అధిక శ్రమతో తక్కువ ఫలితాల సాధన ఉంటుంది. చదువుకోవాలనే ఆసక్తి కొంతవరకు తగ్గవచ్చు. పరామర్శలు చేస్తారు. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. పరాక్రమం తగ్గే సూచనలు. కమ్యూనికేషన్స్‌ వల్ల కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. జాగ్రత్త అవసరం.

ఊహించని ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. అనుకోని ప్రమాదాలకు అవకాశం. అనవసర ఒత్తిడి ఏర్పడుతుంది.  అనారోగ్య సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. సామాజిక అనుబంధాల్లో లోపాలు ఏర్పడతాయి. నూతన పరిచయస్తులతో జాగ్రత్త అవసరం. మోసపోయే అవకాశం ఉంటుంది. గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పెట్టుబడులు పోస్టుపోన్‌ చేయడం మంచిది. తనవల్ల ఎదువారు ఒత్తిడికి గురయ్యే అవకాశం. సమాజంతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

అన్ని రకాల లాభాలకోసం ఎదురు చూపులు ఉంటాయి. వచ్చే ఫలితాలు మధ్యమంగా ఉంటాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. షేర్‌మార్కెట్లపై దృష్టి పెడతారు. కళాకారులకు అనుకూల సమయం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక యాత్రలకు ప్రాధాన్యత వహిస్తారు. అనుకున్న పనులు శ్రమానంతరం పూర్తి అవుతాయి కనుక కొంతలో కొంత సంతృప్తి లభిస్తుంది.

తాము ఏ పనులు మొదలు ప్టిెనా మొదట దైవ ప్రార్థన చేయడం తప్పనిసరి. అందరికీ తెలిసే విధంగా చేయకపోయినా మనసులోనైనా నమస్కరించుకోవాలి. పనులు మొదలు పెట్టేటప్పుడు ఒకికి రెండు సార్లు ఆలోచించి ప్రారంభించాలి.

సహకార లోపాలకు వారి పూర్వకర్మలలో ఇతరుల సహకారం అధికంగా తీసుకోవడం, సేవా తత్పరత లేకపోవడం, సేవకులపై దౌర్జన్యంగా ప్రవర్తించడం, వ్యర్థమైన పనుల కోసం చేతులను వినియోగించడం, సోదరవర్గాన్ని ద్వేషించడం, పనికిరాని అంశాలను, ఇతరుల లోపగుణాలను వినడానికి ఇష్టపడడం వింవి అధికంగా ఉండడం వింవి కారణాలవుతాయి.

వీరికి ఇతరుల సహకారం తక్కువగా లభిస్తుందని తెలుసుకుని తాను స్వయంగా ఇతరులకు సహకారం ఇవ్వడం నేర్చుకోవాలి. ఇతరులకు సాధ్యమైనంత వరకు పని చెప్పకుండా తన పని తాను చేసుకోవడం శ్రేష్ఠం. ఇతరుల మాటలను వినడం, సోదరులతో జాగ్రత్తగా మెలగడం వింవి చేయడం ద్వారా ప్రాయశ్చిత్తం కలుగుతుంది.

తన చుట్టూ ఉన్న దివ్య చైతన్యం తనకు గొప్పగా సహకరిస్తుందని, తన శరీర భాగాలు తనకు ఉపకారాన్ని ఇస్తున్నాయని, తాను సంతృప్తిగా ఉంటూ ఆ యా భాగాలతో ఇతరులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని భావిస్తూ ఉండాలి.

గురువు అనుగ్రహంకోసం వీరు సాయిబాబా ఆరాధన, శ్రీదత్తశ్శరణం మమ జపం, దక్షిణామూర్తి ఆరాధన, ప్రత్యక్షంగా గురువులకు సన్మానాలను చేయడం, గురువుల ఆశీస్సులు తీసుకోవడం దానికోసం కష్టపడడం చేయాలి. దేవాలయాల్లో శనగలు ప్రసాదానికి ఇవ్వడం. స్వీట్సను దానం చేయడం కొత్త నిర్ణయాలు తీసుకోకూడదు.

డా.ఎస్.ప్రతిభ