Asianet News TeluguAsianet News Telugu

గ్రహలోపాలు - చేయదగిన దానాలు

ప్రస్తుత కాలంలో వినియోగించుకునే అంశాలను బట్టి   చేసే దాన స్వరూపం కొంత మార్చుకోవచ్చు. ఆ యా గ్రహాలకు సంబంధించిన కారక వ్యవహారాలను అన్నింనీ దానం చేయవచ్చు.

astrology.. gruha lopalu..danalu
Author
Hyderabad, First Published Sep 19, 2018, 2:51 PM IST

దానాలు చేస్తున్న సందర్భంలో వస్తు, వస్త్ర, ధాన్య, ధన దానాలు ఏవైనా చేయవచ్చు. కాని గ్రహాలకు ప్రత్యేకంగా సూచిస్తున్న సందర్భంలో గత కాలానికీ, ఆధునిక కాలానికీ కొంత వ్యత్యాసాన్ని సూచించవచ్చు. ప్రస్తుత కాలంలో వినియోగించుకునే అంశాలను బట్టి   చేసే దాన స్వరూపం కొంత మార్చుకోవచ్చు. ఆ యా గ్రహాలకు సంబంధించిన కారక వ్యవహారాలను అన్నింనీ దానం చేయవచ్చు.

రవి - గోధుమపిండి, గోధుమ రొట్టెలు, గోధుమ రవ్వ, ఆరెంజ్‌ వస్త్రాలు, ఆరోగ్యం కోసం వైద్యాలయాల్లో దానాలు, ఇతరులకు వైద్యం కోసం కెంపు, బంగారం మొ||నవి.

చంద్రుడు - అన్నదానం, బియ్యం, పాలు, నీళ్ళు, తెలుపు (కాటన్‌) వస్త్రాలు, ముత్యం, వెండి మొ||నవి.

కుజుడు - కందిపప్పు, మిర్చి, పచ్చిఖర్జూర, డ్స్‌ే సిరప్‌, బెల్లం, దానిమ్మ పళ్ళు, ఎరుపు లేదా ఎరుపు అంచు వస్త్రాలు, పగడం మొ||నవి.

బుధుడు - పెసర పప్పు, ఆకుకూరలు, కూరగాయలు,  ఆకుపచ్చ వస్త్రాలు, మరకతం మొ||నవి.

గురుడు - పండ్లు, తీపి పదార్థాలు (స్వీట్స్), శనగపప్పు, హోమాలకు ఆవునెయ్యి,  హోమ ద్రవ్యాలు,  వృక్షాలను నాటడం, ధార్మిక కార్యక్రమాల కోసం దానాలు (విద్య, వైద్యం, భోజనం మొ||నవి), పసుపు లేదా క్రీమ్‌ రంగు వస్త్రాలు, పుష్యరాగం, బంగారం మొ||నవి.

శుక్రుడు - అలంకరణ వస్తువులు (స్త్రీలకు సంబంధించిన బొట్టుబిళ్ళలు, జడ పిన్నులు, జడ రబ్బర్లు, గోరింరు, గోళ్ళరంగులు, సెంటు, పౌడర్లు, అద్దాలు, దువ్వెనలు, పూలు మొ||) డ్రై ఫ్స్ర్‌ూ, చింతపండు, నిమ్మకాయ,  (అన్ని రకాలు), బొబ్బర్లు లేదా అలచందలు, రంగు రంగుల మెరిసే వస్త్రాలు, వజ్రం మొ||నవి.

శని -నూనె (వంటనూనె), నువ్వులు, యోగా, ప్రాణాయామం, ఇనుము, సిమ్‌ెం వంటి  వానిని దేవాలయాలకు దానం చేయడం, నీలి రంగు వస్త్రాలు, ఇంద్రనీలం మొ||నవి.

రాహు - మినప సున్ని ఉండలు, ఇడ్లీలు, మినప గారెలు, యోగ, ప్రాణాయామం, తడిపిన మినుములు ఆవుకు పెట్టడం, పొగ రంగు వస్త్రాలు, గోమేధికం మొ||నవి.

కేతు - పశు పకక్షులకు ఆహారం పెట్టడం, ఉలవల పొడిని ఆవులకు పెట్టడం, యోగా, ప్రాణాయామం, చిత్ర విచిత్ర వర్ణ వస్త్రాలు, వైడూర్యం మొ||నవి.

గ్రహాలకు సంబంధించిన సాధారణ దానాలే కాక అసలు విద్య కోసం, వైద్యం కోసం, భోజనం కోసం ఇచ్చే దానాలు ధార్మిక దానాలు అనిపించుకుటాంయి. ఆ అవకాశాలు ఎక్కడ లభించినా ఉపయోగించుకోవాలి. దానిలో కుల, మత, వర్గ, ప్రాంత వ్యవహారాలకు అతీతంగా వ్యవహరించాలి. 

దేవాలయాలు వంటివి నిర్మించిన తర్వాత చాలా కాలం పాటు ఉండి ఎంతోమందికి ఊరటను ఇస్తుటాంయి కాబట్టి   దేవాలయ నిర్మాణం, నిర్వహణ, జీర్ణోద్ధరణ వంటి  కార్యక్రమాలకు దానం చేయవచ్చు. ఈ విధంగా దానం పాత్రతను ఎరిగి చేయాలి. నిత్యజీవనావసరాలైన పప్పులు, కూరగాయలు, బియ్యం, పంచదార, నూనె వంటి వి తోచినంతగా వేరు వేరు ప్యాకెట్లలో పనివారికి, వేరు వేరు నిర్మాణ ఇతర రంగాల కూలీలకు, అనాథాశ్రమాలలో ఇస్తూ ఉండడం వల్ల వారందరికీ మేలు కలుగుతుంది. ముఖ్యంగా అనాథాశ్రమాలను తెలుసుకుని అక్కడి అవసరాలను తీర్చుతూ ఉంటే ఉత్తమ దానఫలితం కలుగుతుంది.

డా.ఎస్ ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios