1. శరత్‌ బాబు

ఏమైనా సమస్యలు ఉన్నాయా?

ప్రస్తుతం జూన్‌ తర్వాత నుంచి ఒక సంవత్సరం పాటు సమయం బాలేదు. సంప్రదింపుల్లో సమస్యలు ఉంటాయి. ఆలోచనల్లోఒత్తిడి ఏర్పడుతుంది. సంతాన వ్యవహారాల్లో కూడా జాగ్రత్త అవసరం.

దానాలు : కందిపప్పు/ కర్జూరాలు/ దానిమ్మపళ్ళు 2. పశుపక్షాదులకు ఆహారం, నీరు పెట్టడం; 3. నూనె ఆహారంలో వాడుకునేవారికి / దీపారాధనకు/ పల్లీలు మొదలైనవి నిరంతరం దానం చేస్తూ ఉండాలి.

జపం : శ్రీరామ జయరామ జయజయ రామరామ మంచిది.

2. రాజగోపాలరావు

ఉద్యోగం మరియు జీవితం ఎలా ఉంది?

ప్రస్తుతం 2019 జులై వరకు బావుంది. ఆగస్టు నుంచి 1 సం||పాటు సమయం బాగా లేకపోవటం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలకు కూడా అవకాశం ఉండే సూచనలు ఉన్నాయి. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. కందిపప్పు జీవితాంతం దానం చేయాలి. ఇది జీవితాంతమే కాకుండా ప్రస్తుతం 1 సం||పాటు చాలా అధికంగా దానం చేయడం మంచిది.

2020 ఆగస్టు నుంచి అన్నిరకాల ఎదుగుదలకు అవకాశం ఉంటుంది. దానం ఎంత ఎక్కువచేస్తే ఎదుగుదల అంత ఉంటుంది.

జపం :  మంగళం భగవాన్‌ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్ష, మంగళాయతనం హరిః

దానం : కందిపప్పు, 2. విద్యార్థులకు పుస్తకాలు మొదలైనవి దానం చేస్తూ ఉండాలి.

3. నరేందర్‌ రెడ్డి

జాతకం చెప్పండి?

2019 ఏప్రిల్‌ నుంచి 1 సం||పాటు అంటే ఆగస్టు 2020 ఆగస్టు వరకు సమయం చాలా అనుకూలంగా ఉంది. చేసే అన్ని పనుల్లో వృద్ధి, గుర్తింపు, గౌరవం, ఉన్నతి అన్నీ సాధ్యమౌతాయి. వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి. కొంచెం జాగ్రత్త అవసరం.

మిగిలిన అన్ని అంశాలు బాగా ఉన్నప్పికీ ఎప్పికప్పుడు చేసే దానాలు మిమల్ని వృద్ధిలోకి తీసుకొస్తాయి.

దానం : గోధుమరొట్టెలు/ గోధుమపిండి/ గోధుమరవ్వ/ 2. కందిపప్పు/ కర్జూరాలు/ దానిమ్మపళ్ళు / 3. నూనె అవసరాలకు / దేవాలయాలకు / పల్లీలు దానం చేయాలి.

జపం :  శ్రీరామ జయరామ జయజయ రామరామజ, శ్రీ దత్త శ్శరణం మమ దానాలు మంచివి.

4. రఘునాథ్‌

లైఫ్‌ స్టైల్‌ మరియు ఉద్యోగం ఎలా ఉంటుంది?

జాతకరీత్యా ప్రస్తుతం అక్టోబర్‌ చివరి వరకు అన్ని పనుల్లో అనుకూలంగానే ఉంటుంది. తర్వాత ఒక సంవత్సరం పాటు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో అసంతృప్తి, ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది. అనవసర అనుబంధాలు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త అవసరం.

ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉన్నందువల్ల రెగ్యులర్‌గా దానధర్మాలు చేయకపోతే వేరువేరు విధాలుగా ధనం కోల్పోయే అవకాశం ఉంటుంది.

దానం : కందిపప్పు/ కర్జూరాలు / దానిమ్మపళ్ళు 2. నూనె / పల్లీలు / 3. పశుపక్షాదులకు ఆహారం, నీరు ప్టోలి.

జపం : మంగళం భగవాన్‌ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్ష, మంగళాయతనం హరిః

జపం నిరంతరం చేసుకుంటూ ఉండాలి.

5. అమర్‌కుమార్‌

ఇద్దరికీ ప్రస్తుత సమయం అనుకూలంగా లేదు.

అమర్‌ : 2 సెప్టెంబర్‌ లోపు మంచి మార్పులు రాగలవు. గృహ నిర్మాణాదులకు ఉద్యోగాలలో పదోన్నతికి అవకాశం ఎక్కువ. బద్ధకాన్ని తగ్గించుకోవాలి. యోగ, ప్రాణాయామాలు చేసి శరీరాన్ని ఎప్పికప్పుడు కాపాడుకోవాలి. ప్రతిరోజూ వాకింగ్‌ తప్పనిసరి. నీరు ఎక్కువగా తీసుకోవాలి. ఆహారాన్ని బాగా నమిలి తినాలి.

దానం : మినపప్పు, మినపసున్ని ఉండలు/ ఇడ్లీ, వడ/ పశుపక్షాదులకు ఆహారం / 3. నూనె/ పల్లీలు దానం చేయాలి.

జపం : శ్రీరామ జయరామ జయజయ రామరామ మంచిది.

అరుణకుమారి

2021 నవంబర్‌ తర్వాత బావుంటుంది. బద్ధకాన్ని తగ్గించుకోవాలి. యోగ, ప్రాణాయామాలు చేసి శరీరాన్ని ఎప్పికప్పుడు కాపాడుకోవాలి. ప్రతిరోజూ వాకింగ్‌ తప్పనిసరి. నీరు ఎక్కువగా తీసుకోవాలి. ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ఆధ్యాత్మికం వైపుదృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. అది పెంచుకోవచ్చు.

దానం : గోధుమపిండి / గోధుమరొట్టెలు/ 2. అలంకరణ వస్తువులు / నిమ్మకాయ పులిహోర / 3. నూనె / పల్లీలు దానం చేయాలి.

జపం : హరహర శంకర జయజయ శంకర ; క్రీం అచ్యుతానంత గోవింద నిరంతరం చేసుకోవాలి.

6. సాదర్‌ అలీ

వివాహం ఎప్పుడు ?

మీ జాతకంలో 30 సం||ల తర్వాత వివాహ యోగాలు వచ్చినప్పికీ మీరు చేసుకున్నటువిం పుణ్యకర్మలు జపాలు దానాలు సరిగా లేకపోవడం వల్ల వివాహ భావన మీకు అనుభవంలోకి రాకుండా కలల్లోనే తీరిపోయింది. ప్రస్తుతం సమయం అంత అనుకూలంగా లేదు. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

జాతకరీత్యా ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉన్నందున 30శాతం పైగా దానాలు చేయాలి. దానం చేస్తే తప్ప మీకు అభివృద్ధి కలుగదు. ఇలా చేస్తూ పోతే 2020 తర్వాత కొంత వరకు అవకాశం ఉండవచ్చు.

జపం : శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే, నిధయేర్థినాం, శ్రీ వేంకటనివాసాయ, శ్రీనివాసాయ మంగళం.

దానం : గోధుమపిండి / గోధుమరొట్టెలు/ 2. కందిపప్పు/ కర్జూరపళ్ళు/ దానిమ్మపళ్ళు/ 3. అలంకరణ వస్తువులు/ నిమ్మకాయ పులిహోర, దానం చేయాలి.

డా.ఎస్.ప్రతిభ