Asianet News TeluguAsianet News Telugu

జాతకం...నాకు పెళ్లి ఎప్పుడు అవుతుంది..?

మాకు పంపిన కొందరి జాతక సమస్యలకు పరిష్కారాలు ఇక్కడ ఉన్నాయి

5members of future and astrology is here
Author
Hyderabad, First Published Feb 6, 2019, 9:56 AM IST

1. సంధ్య

ఫ్యూచర్‌ ఎలా ఉంటుంది? వివాహం ఎప్పుడు అవుతుంది?

జులై తర్వాత వివాహానికి సంబంధాలు వెతకడం ప్రారంభించాలి. అక్టోబర్‌ నవంబర్‌లలో వివాహం అవుతుంది. ప్రస్తుతం సమయం అంత అనుకూలంగా లేదు. వీరికి జీవితంలో అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. దానిని తగ్గించుకునేందుకు శ్రీ దత్త శ్శరణం మమ జపం నిరంతరం చేసుకుంటూ ఉండాలి. ఇవి జీవితాంతం వరకు చేసుకుంటూ ఉండాలి. జపం దానాలు ఎంత ఎక్కువ చేసుకుంటూ ఉంటే అసంతృప్తి అంత తొందరగా తగ్గుతుంది. ఇవి చేయడం మాని వేస్తే మళ్ళీ వెంటనే వస్తాయి. కనుక వీటిని మానకుండా చేసుకోవాలి.

జపం :    కల్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినేశ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం

దానాలు : 1. కందిపప్పు / దానిమ్మపళ్ళు,/ ఖర్జూరాలు, 2. గోదుమపిండి, రవ్వ/ చపాతీలు, 3. ఇడ్లీ వడ / మినప సున్ని ఉండలు. ఈ పదార్థాలు దానాలు చేయడం తప్పనిసరి. వివాహం కావడం ఒకటే కాదు, తరువాత జీవితం కూడా ఆనందమయంగా ఉండాలి.

2. శ్రీ కాంత్‌బాబు

కెరీర్‌ ఎలా ఉంటుంది?

వీరికి ఉగాది నుంచి సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా ఉన్నతస్థాయికి వెళతారు. మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. కాని 2,3 గ్రహాల అననుకూలత వల్ల ఆ స్థితి ఇబ్బంది పడకుండా ఆ గ్రహాల శాంతికోసం నిరంతరం జపం దానం చేయాలి.

జపం : శ్రీరామ జయరామ జయజయ రామ రామ / శ్రీ రాజమాతంగ్యై నమః జపాలు నిరంతరం చేసుకుంటూ ఉండాలి.

1. నూనె, వండుకునేవారికి వంటకు, దేవాలయంలో దీపారాధనకు; 2. వారానికి ఒకరోజు పులిహోర పులుపుకు వాడకం ఉండాలి కావున చింతపండుతో కాని నిమ్మకాయతోకాని చేసినది. 3. గోధుమ రవ్వ, గోధుమరొట్టెలు, 4. ఇడ్లీ, వడ/ మినప సున్ని ఉండలు, మినపప్పు. అనాథ శరణాలయాలకు, పేదలకు నిరంతరం దానం చేస్తూనే ఉండాలి.

3. హనిమీరెడ్డి

భాగస్వామ్య వ్యాపారం ఎలా ఉంటుంది? వ్యాపారం కలిసి వస్తుందా?

సాధారణంగా మీకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసిరావటం కొంచెం కష్టం. ఐనా జాగ్రత్తలు తీసుకుని ముందరికి వెళ్ళాలి. ప్రస్తుతం నుంచి 2020 నవంబర్‌ 15వ తేదీ వరకు సమయం అంత అనుకూలంగా లేదు. ఆ తర్వాత క్రమంగా జీవితంలో మంచి మార్పులకు అవకాశం ఉంటుంది. 2023 మే తర్వాత వ్యాపారం కూడా మరింత వృద్ధి చెందుతుంది. తాత్కాలికంగా ఈ లోపాలను కొంతవరకు అధిగమించడం కోసం ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. అందుకు దానాలు జపాలు నిరంతరం చేసుకోవాలి.

దానాలు : 1. గోధుమరవ్వ, చపాతి, 2. నూనె, వంటకు, దేవాలయాలలో దీపాలకు ఇవ్వాలి, పల్లీలు, 3. పశు పక్షాదులకు ఆహారం పెట్టడం, 4. ఇడ్లీ వడ, 5. కందిపప్పు / దానిమ్మపళ్ళు / ఖర్జూరాలు దానం చేయాలి.

జపం : శ్రీరామ జయరామ జయజయ రామరామ, హర హర శంకర, జయజయ శంకర ఈ జపాలు, పైన చెప్పిన దానాలు నిరంతరం జీవితాంతం చేస్తూ ఉండాలి.

4. బాలాజి

వివాహం ఎప్పుడు అవుతుంది?

వీరికి 14 జులై 2019 నుంచి 15 మే 2020 లోపు వివాహానికి మంచి సమయం. అందులోనూ అక్టోబర్‌, నవంబర్‌ మాసాలు వివాహానికి ఎక్కువ అనుకూలమైన సమయాలు. వీరి కేరీర్‌ ఇప్పుడు పర్వాలేదు కాని 2021 సెప్టెంబర్‌ తర్వాత అన్ని చికాకులు తగ్గి భవిష్యత్తు పూర్తిస్థాయిలో అనుకూలంగా ఉంటుంది.

జపం :    కల్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే, శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం

దానాలు : 1.  గోధుమరవ్వ/ గోధుమ పిండి/ గోధుమరొట్టెలు, 2. కందిపప్పు/ దానిమ్మ పళ్ళు / సపోట పళ్ళు / ఖర్జూరాలు దానం చేయడం మంచిది.

వివాహం కావడం ఒకి, వివాహం ఆనందంగా జరగాలి, వైవాహిక జీవితం అనుకూలంగా ఉండాలి, సంతానం కూడా బావుండాలి అనుకునేవారు నిరంతరం దానాలు, జపాలు తప్పనిసరి.

చింతా హరి రామ కుమార్, నారాయణ శాస్త్రిలు..పూర్తి వివరాలు పంపించలేదు. కనుక వారి జాతకాలు ఇందులో పొందుపరచలేదు. పూర్తి జాతకం రాయడానికి ఇది వేదిక కాదు కాబట్టి.. మీ సమస్యను మాత్ర తెలియజేయగలరు.

 

డా.ఎస్.ప్రతిభ

మీ జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా..?

Follow Us:
Download App:
  • android
  • ios