12 నవంబర్ 2018 సోమవారం రాశిఫలాలు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. సామాజిక అనుబంధాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఒత్తిడికి లోను కారాదు. నూతన పరిచయస్తులతో అప్రమత్తత అవసరం. భాగస్వామ్య అనుబంధాలు తగ్గించే సూచనలు ఉన్నాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : పోటీల్లో గెలుపుకై కష్టపడాలి. శత్రువుల విషయంలో జాగ్రత్త అవసరం. రుణదారులు వెంటపడే అవకాశం. జాగ్రత్తలు వహించాలి. మాట విలువ పెంచుకోవాలి. మధ్యవర్తిత్వాలు చేయరాదు. రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమఃజపంమంచిది.
డా.ఎస్.ప్రతిభ
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సంతానం వల్ల సంతోషం కలుగుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. కళాకారులకు అనుకూల సమయం. మానసిక ప్రశాంతతను పెంచుకుటాంరు. విద్యార్థులు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాల సాధన ఉంటుంది. సంతృప్తి లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సౌకర్యాల వల్ల సంతోషం కలుగుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. మాతృసౌఖ్యం లభిస్తుంది. ఇండులో అన్ని వస్తువుల అమరికకు ప్రయత్నం చేస్తారు. విందుభోజనాలపై దృష్టి పెడతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. సుగంధ ద్రవ్యాలపై ఎక్కువ ఆసక్తిని చూపుతారు. లక్ష్మీ అష్టోత్తర పారాయణం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : దగ్గరి ప్రయాణాలు చేస్తారు. ప్రచార, ప్రసార సాధనాలు అనుకూలిస్తాయి. స్త్రీల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూల సమయం. కళాకారులు తమ ప్రతిభను చాటుకుటాంరు. పరామర్శలు చేస్తారు. సంతృప్తి లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : వాక్ చాతుర్యం పెరుగుతుంది. మధ్యవర్తిత్వాలు నెరవేరుతాయి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఆనందకర వాతావరణం పెంచుకుటాంరు. స్థిరాస్తులను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కింలోపాలు తొలగిపోయే సూచన. దూరదృష్టి పెరుగుతుంది. విష్ణుసహస్రనామ పారాయణ మంచి చేస్తుంది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : శరీర సౌఖ్యం లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. గుర్తింపు లభిస్తుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు చేస్తారు. ప్రయాణాల్లో సంతృప్తి లభిస్తుంది. ఎదుడువారిని ఆకర్షించే తత్త్వాన్ని కలిగి ఉంటారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : విహార యాత్రలపై దృష్టి అధికంగా ఉంటుంది. విశ్రాంతి లభిస్తుంది. అనవసర ఖర్చులు పెంచుకునే అవకాశం. దూర ప్రయాణాలు చేస్తారు. మానసిక ప్రశాంతతకు ప్రయత్నిస్తారు. ఇతరులపై ఆధారపడతారు. చిత్త చాంచల్యం తగ్గుతుంది. ప్రశాంతంగా ఉంటుంది. లక్ష్మీ అష్టోత్తర పారాయణం శుభఫలితాలనిస్తుంది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : ఊహించని లాభాలు వస్తాయి. పెద్దల ఆశీస్సులు అనుకూలిస్తాయి. కళాకారులకు అనుకూల సమయం. ఉపాసనను పెంచుకునే మార్గం చేస్తారు. ఆరోగ్య నియమాలు పాడుస్తారు. సమిష్టి ఆదాయాలు అనుకూలిస్తాయి. అన్ని రకాల అభివృద్ధి పనులు మొదలుపెడతారు. ఓం నమఃశివాయజపం చేసుకోవడం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : రాజకీయ విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సంఘంలో గౌరవంకోసం ఆరాట పడతారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు కష్టకాలం ఉంటుంది. లలితాపారాయణ, శ్రీ హయగ్రీవాయనమః జపం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పరిశోధకులకు అనుకూల విషయం. దూర ప్రయాణాలపై ఆసక్తి. విహార యాత్రలు చేస్తారు. శుభ కార్యాల్లో పాల్గొంటారు. విందు భోజనాలపై ఆసక్తి ఉంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం. పెద్దలంటే గౌరవ మర్యాదలు ఉంటాయి. లక్ష్మీ అష్టోత్తర పారాయణం శుభఫలితాలనిస్తుంది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలుఅన్వేషిస్తారు. తక్కువ శ్రమతో ఎక్కువ సంపాదనపై దృష్టి ఉంటుంది. ఆరోగ్యం విషయలో జాగ్రత్త వహిస్తారు. వ్యాపారస్తులకు అనుకూల సమయం. విద్యార్థులు తక్కువ శ్రమతో మంచి ఫలితాల సాధన ఉంటుంది. విష్ణుసహస్రనామ పారాయణ మంచి చేస్తుంది.