Asianet News TeluguAsianet News Telugu

వైసీపీకి కేఏ పాల్ దెబ్బ: ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాప్టర్ రెక్కలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ అయిన ఫ్యాన్ గుర్తును పోలి ఉందని దానికి కూడా సమీక్షించాలని విజ్ఞప్తి చేసింది. గుర్తును మార్చాలని మార్చి 8న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. రాష్ట్రంలోని 35 అసెంబ్లీ నియోజకవర్గాలలో, నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలినట్లుగా ఉండే విధంగా అభ్యర్థులను ప్రజాశాంతి పార్టీ పోటీకి నిలిపిందని ఫిర్యాదులో పేర్కొంది. 

ysrcpp complaint to the Election Commission on the prajasanthiparty
Author
Amaravathi, First Published Mar 26, 2019, 7:53 PM IST

అమరావతి: రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు ప్రజాశాంతి పార్టీ అనైతిక చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. 

ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాప్టర్ రెక్కలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ అయిన ఫ్యాన్ గుర్తును పోలి ఉందని దానికి కూడా సమీక్షించాలని విజ్ఞప్తి చేసింది. గుర్తును మార్చాలని మార్చి 8న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. 

రాష్ట్రంలోని 35 అసెంబ్లీ నియోజకవర్గాలలో, నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలినట్లుగా ఉండే విధంగా అభ్యర్థులను ప్రజాశాంతి పార్టీ పోటీకి నిలిపిందని ఫిర్యాదులో పేర్కొంది. 

ఓటర్లలో అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు ద్వారా అయోమయానికి గురి చేసే విధంగా అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజాశాంతి పార్టీ గుర్తు మార్చడంతోపాటు అనైతిక చర్యలపై చర్యలు తీసుకోవాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి, పార్టీ అదనపు కార్యదర్శి పద్మారావులు గోపాలకృష్ణ ద్వివేదీకి ఫిర్యాదు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios