Asianet News TeluguAsianet News Telugu

ఈనెల 26న మోదీతో జగన్ భేటీ : ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానం

జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరుకావాల్సిందిగా మోదీని ఆహ్వానించేందుకు వైయస్ జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. అలాగే దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కూడా ప్రధానమంత్రి మోదీతో జగన్ చర్చించనున్నారు. 
 

ysrcp president ys jagan  invites pm narendra modi to swearing ceremony
Author
Amaravathi, First Published May 24, 2019, 8:07 PM IST

విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 26న ఢిల్లీలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంతో వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరుకావాల్సిందిగా మోదీని ఆహ్వానించేందుకు వైయస్ జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. అలాగే దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కూడా ప్రధానమంత్రి మోదీతో జగన్ చర్చించనున్నారు. 

ఇకపోతే వైయస్ జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోదీ వైయస్ జగన్ కు స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అఖండ విజయం సాధించారని కొనియాడిన సంగతి తెలిసిందే. 

ఇకపోతే ప్రధాని నరేంద్రమోదీ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు సమర్పించారు. అయితే తదుపరి బాధ్యతలు స్వీకరించే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని మోదీకి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సూచించారు. ఇకపోతే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శుక్రవారం సాయంత్రం కేంద్రమంత్రులకు విందు ఇవ్వనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios