Asianet News TeluguAsianet News Telugu

ఒళ్లంతా ఉప్పూ కారం పూసి బుద్ది చెప్పారు: బాబుపై విజయసాయిరెడ్డి ధ్వజం

ఇక చంద్రబాబు పాదం మోపిన చోటల్లా ప్రాంతీయ పార్టీలకు శని దాపురించిందని, గతంలో 33సీట్లు గెలిచిన మమత ఈసారి 22 స్థానాలకే పరిమితమయ్యారని గుర్తు చేశారు. ఢిల్లీలోని 7 సీట్లలో అయితే కేజ్రీవాల్ ఖాతా కూడా తెరవలేదని, బీఎస్పీ 38 సీట్లలో నిలిస్తే 11 చోట్ల గెలిచిందని తెలిపారు. 

ysrcp mp vijayasaireddy sensational comments on chandrababu
Author
Amaravathi, First Published May 24, 2019, 3:22 PM IST

హైదరాబాద్‌: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. ఎన్నికల ముందు పసుపు-కుంకుమ పేరుతో మహిళలను కించపరచాలని చూసిన చంద్రబాబుకు ఒళ్లంతా ఉప్పూ-కారం పూసి బుద్ధిచెప్పారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత ఆయన వరుస ట్వీట్లతో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. కుట్రలు, కుతంత్రాలు, వంచనలు, అబద్ధాలు, యూ-టర్నులు, వేల కోట్ల పంపిణీలు ప్రజలను ఏమాత్రం ఏమార్చలేక పోయాయి. 

పసుపు-కుంకుమ పేరుతో మహిళలను కించపర్చాలని చూస్తే వళ్ళంతా ఉప్పూ-కారం పూసి బుద్ధి చెప్పారు. నీ అంత దిగజారిన నీచుడు ప్రపంచంలోనే ఎక్కడా కనిపించడు చంద్రబాబూ అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. 

ఒక యువ నాయకుడిపై ప్రజలు ఇంత అపూర్వమైన ప్రేమ, అచంచల విశ్వాసాన్ని ప్రదర్శించడం దేశ చరిత్రలోనే అరుదు అంటూ చెప్పుకొచ్చారు. ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పని కుటుంబానికి ప్రజలు నీరాజనం పలికారని తెలిపారు. 

అభివృద్ధిలో దేశానికే వెలుగు దివ్వెగా ఆంధ్రప్రదేశ్ మారబోతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలతో దేశమంతా ఏపీ వైపు ఆశ్చర్యంగా చూస్తోందంటూ ట్వీట్ చేశారు. ఇక చంద్రబాబు పాదం మోపిన చోటల్లా ప్రాంతీయ పార్టీలకు శని దాపురించిందని, గతంలో 33సీట్లు గెలిచిన మమత ఈసారి 22 స్థానాలకే పరిమితమయ్యారని గుర్తు చేశారు. 

 

ఢిల్లీలోని 7 సీట్లలో అయితే కేజ్రీవాల్ ఖాతా కూడా తెరవలేదని, బీఎస్పీ 38 సీట్లలో నిలిస్తే 11 చోట్ల గెలిచిందని తెలిపారు. అఖిలేశ్ 6 దగ్గర ఆగాడని, కుమార స్వామికి ఒక్కటే సీటు వచ్చిందన్నారు. మరోవైపు చంద్రబాబు అనుకూల మీడియాపైనా విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. 

కులమీడియా దళారులు ఎంత సిగ్గుమాలిన వార్తలు రాశారు. చంద్రబాబు ప్రధాని రేసులో ఉన్నాడని కూడా రాశారు. ప్రతిపక్ష కూటమికి మీరే నాయకత్వం వహించాలని అఖిలేశ్ యాదవ్ అనకున్నా అన్నట్టు చూపించారు. జర్నలిజాన్ని చంద్రబాబు పాదాల వద్ద తాకట్టు పెట్టారు గదా.’ అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios