Asianet News TeluguAsianet News Telugu

లోకేష్ కు పీజ్జాబర్గర్ లు తినడం తప్ప కాడితెలుసా, మేడి తెలుసా: వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఫైర్


మంగళగిరిలో తనకు సరైన పోటీ నారాలోకేష్‌ కానేకాదని, వాళ్ల తండ్రి చంద్రబాబు నాయుడని ఆర్కే పేర్కొన్నారు. లోకేష్‌ పీడ వదిలించుకోవడానికే వాళ్ల నాన్న తనపై పోటీకి పంపారని ఎద్దేవా చేశారు. 

ysrcp mla alla ramakrishnareddy fires on nara lokesh
Author
Mangalagiri, First Published Mar 22, 2019, 3:22 PM IST

మంగళగిరి: ఏపీ మంత్రి నారా లోకేష్ పై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు. లోకేష్ కు పీజ్జా బర్గర్ లు తినడం తప్ప కాడి తెలుసా, మేడి తెలుసా అంటూ విరుచుకుపడ్డారు. 

మంగళగిరి వైసీపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషనల్ దాఖలు చేసిన ఆయన ఐదేళ్ల చంద్రబాబు నాయుడి పాలనలో ప్రజలకిచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఓట్లను అడుగుతున్నారని ధ్వజమెత్తారు. 

మంగళగిరిలో తనకు సరైన పోటీ నారాలోకేష్‌ కానేకాదని, వాళ్ల తండ్రి చంద్రబాబు నాయుడని ఆర్కే పేర్కొన్నారు. లోకేష్‌ పీడ వదిలించుకోవడానికే వాళ్ల నాన్న తనపై పోటీకి పంపారని ఎద్దేవా చేశారు. 

లోకేష్‌కు పీజ్జా బర్గర్‌లు తినడం తప్ప.. కాడి తెలుసా, మేడి తెలుసా అని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గంలో మరోసారి వైసీపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజన్న రాజ్యం కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని స్పష్టం చేశారు. 

తనకు స్వచ్చందంగా ప్రజల మద్దతు లభిస్తోందని ఆర్కే స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం మంగళగిరి ప్రజలకు ఏం చేసిందో వివరించి ఆ తరువాత ఓట్లు అడగాలని ఎమ్మెల్యే ఆర్కే డిమాండ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios