అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం టార్గెట్ గా ఏపీ రాజకీయాలు జరుగుతున్నాయి. బుధవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని అధికార తెలుగుదేశం పార్టీ నేతలు కలవగా గురువారం ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. 

ఏపీ డీజీపీ ఆర్.పి.ఠాకూర్ ని బదిలీ చెయ్యాలని ఎన్నికల విధుల నుంచి ఆయనను తప్పించాలని కోరనున్నట్లు సమాచారం. అలాగే ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేయనున్నారు. 

రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైవీ సుబ్బారెడ్డిలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. 

ఈ మేరకు వైసీపీ ప్రధాన కార్యాలయం బుధవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. మెుత్తానికి ఏపీ ఎన్నికల సందర్భంగా నేతలు కేంద్ర ఎన్నికల సంఘం కేంద్రంగా రాజకీయాలు జోరుపెంచారు.