విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళావెంకట్రావ్ పై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల కోసం అన్నదమ్ములను చంపిన కళా వెంకట్రావ్ నువ్వా మాకు చెప్పేది అంటూ విరుచుకుపడ్డారు. 

ఆస్తుల కోసం అన్నదమ్ములను చంపిన కుటుంబం మీది కాదా అంటూ విరుచుకుపడ్డారు. ఇప్పుడు గురువింద గింజలా మాట్లాడొద్దని హెచ్చరించారు. పదేళ్లు మంత్రిగా పనిచేశానని నీ గురించి నాకు తెలియంది ఏముందన్నారు. 

ఆస్తుల కోసం నువ్వు కాదా నీ కుటుంబ సభ్యులను చంపిది అని నిలదీశారు. ఆస్తుల కోసం అన్నదమ్ములను చంపలేదని నువ్వు చెప్పగలవా అంటూ నిలదీశారు. హత్యారాజకీయాలు చేసిన మీరు హత్యలు గురించి మాట్లాడతారా అంటూ మండిపడ్డారు. 

ఆస్తుల కోసం వైఎస్ వివేకానందరెడ్డిని కుటుంబ సభ్యులే చంపేశారని ఆరోపించడాన్ని ఆయన తప్పుబట్టారు. హత్యలు చేసిన కుటుంబం నీదేనని నా నోటితో ఇంకా చెప్పించుకోకండి అంటూ హితవు పలికారు. రాజకీయాలు చేయోచ్చు కానీ ఇలా దిగజారి రాజకీయాలు చేయోద్దని హితవు పలికారు. 

వ్యక్తిగతంగా వెళ్తూ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే బాదేస్తుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే దారుణంగా ఉన్నాయన్నారు. మీ బావమరిది ఇంట్లో జరిగిన హత్యాయత్నంపై ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని నిలదీశారు. 

జగన్ వేల కోట్లు సంపాదించారని చంద్రబాబు పదేపదే చెప్తున్నారని ఆయన ఆస్తులు రెండు ఎకరాల నుంచి వెయ్యి కోట్లకు ఎలా పెరిగాయో చెప్పాలని నిలదీశారు. హెరిటేజ్ ద్వారానే వచ్చేస్తుందని చెప్పుకొస్తున్న చంద్రబాబు ఎంత వస్తుందో అందరికీ తెలుసునన్నారు. 

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమంగా సంపాదించారని చంద్రబాబు పై విరుచుకుపడ్డారు బొత్స సత్యనారాయణ. హైదరాబాద్ లో నాలుగువందల కోట్ల రూపాయలు పెట్టి బంగళాలు నిర్మించారని అది మాత్రం అఫిడవిట్ లో చూపించలేకపోయారంటూ ఆరోపించారు. తాను పదేళ్లు మంత్రిగా పనిచేశానని కానీ వేల కోట్లు సంపాదించలేకపోయామని, అంత పెద్ద బంగళాలు నిర్మించలేకపోయామని బొత్స స్పష్టం చేశారు.