ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తమ పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ నిజనిర్ధారణ కమిటీని నియమించారు.

ఈ కమిటీ గుంటూరు జిల్లా గురజాల, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలో పర్యటించి స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన అనుచరులు చేసిన దాడులపై నిజనిర్థారణ చేయనుంది.

మర్రి రాజశేఖర్ నేతృత్వంలో 10 మంది సభ్యులు ఈ కమిటీలో ఉంటారు. ఈ నెల 11న పోలింగ్ సందర్భంగా గురజాల, నరసరావుపేటలలో వైసీపీ అభ్యర్థులపై దాడులు జరిగాయి. అలాగే సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమిట్లలోని ఓ పోలింగ్ బూత్‌లో స్పీకర్ కోడెల శివప్రసాదరావు హల్ చల్ చేశారు.