ఎన్నికల వేళ చిత్తూరు జిల్లాలో టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పనబాకం హరిజనవాడలో టీడీపీ కార్యకర్తలపై ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు శనివారం రాత్రికి దాడి చేశారు.

సర్వే పేరుతో రాత్రి వూరికి వచ్చిన వైసీపీకి చెందిన ఛానల్ ప్రతినిధులను పనబాకం హరిజనవాడ గ్రామస్తులు ప్రశ్నించారు. మీడియా ప్రతినిధులకు మద్ధతుగా ఉన్న చెవిరెడ్డి అనుచరులు అడ్డుకున్న వారిపై దౌర్జన్యానికి దిగారు. అక్కడ అడ్డొచ్చిన తెలుగుదేశం కార్యకర్తలను కర్రలు, దుంగలతో విచక్షణారహితంగా కొట్టారు.

ఈ డాడిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. బాధితులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి పులివర్తి నాని బాధితులను పరామర్శించారు.