అమరావతి: భారీ విజయాన్ని అందించిన ఆంధ్ప్రదేశ్ ప్రజలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు, దేవుడు, వైసీపీని ఆశీర్వదించి ఇంతటి విజయాన్ని అందించారని తెలిపారు. 

అమరావతిలో జాతీయ మీడియాతో మాట్లాడిన వైయస్ జగన్ ఈ విజయాన్ని తాము ఊహించిందేనని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తాను రుణపడి ఉంటానని తెలిపారు. మరోవైపు కేంద్రంలో అత్యధిక స్థానాలను కైవం చేసుకుంటున్న మోదీకి శుభాకాంక్షలు తెలిపారు జగన్. 

అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న మోదీకి శుభాకాంక్షలు అంటూ జగన్ చెప్పుకొచ్చారు. యూపీఏ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి తాను ఏమీ మాట్లాడనన్నారు. తమకు ప్రత్యేక హోదాయే మెయిన్ అజెండా అన్నారు. ప్రతయేక హోదా సాధించే దిశగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని తెలిపారు వైయస్ జగన్.