శ్రీకాకుళం జిల్లాను ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోలేదన్నారు వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంగళవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని జి.సిగడాంలో జరిగిన బహిరంగసభలో విజయమ్మ ప్రసంగించారు

శ్రీకాకుళం జిల్లాను ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోలేదన్నారు వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంగళవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని జి.సిగడాంలో జరిగిన బహిరంగసభలో విజయమ్మ ప్రసంగించారు.

జిల్లాల్లోని 34 ప్రభుత్వ పాఠశాలలను, 5 ఎస్సీ హాస్టల్స్‌ను చంద్రబాబు మూసివేశారని తెలిపారు. ఈ సారి జరుగుతున్న ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్నవి విజయమ్మ అభివర్ణించారు.

శ్రీకాకుళం జిల్లాతో తమ కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందని వైఎస్ రాజశేఖర్ రెడ్డి, షర్మిల, జగన్‌ పాదయాత్రలు ఇక్కడే ముగిశాయని ఆమె గుర్తు చేశారు. రాష్ట్రం రెండు ముక్కలై.. ఏమి లేకుండా మిగిలిపోయామని, అలాంటిది చంద్రబాబు పాలనలో టీడీపీ నేతలు ప్రభుత్వ సంపదను అమ్ముకుని తింటున్నారని ఆరోపించారు.

రాజధాని భూములు, విశాఖలో భూములు, దళితుల భూములు దోచుకుంటున్నారని ప్రజలను మేల్కొనమని కోరుతున్నానన్నారు. కేంద్రం కట్టాల్సిన పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌ను.. తన బినామీలకు లాభం చేకూర్చేందుకు చంద్రబాబు తీసుకున్నారని విజయమ్మ ఆరోపించారు.