ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నేతాశ్రీలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయితే ఇదే అదనుగా జనం చేతి వాటం చూపిస్తున్నారు. నాయకుల ప్రచారానికి హాజరయ్యే జనం నగదు, నగలు దొచేస్తున్నారు. ఇక్కడితే ఆగితే పర్లేదు.. కానీ ఏకంగా నాయకుల సొత్తుకే ఎసరు పెడితే..

వివరాల్లోకి వెళితే.. వైసీపీ అధినేత, వైఎస్ జగన్ సోదరి షర్మిల గుంటూరు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అభిమానులకు, కార్యకర్తలకు ఆమె బస్సులోంచి అభివాదం చేస్తున్నారు.

ఈ సమయంలో అందరూ చూస్తుంగానే షర్మిల చేతి ఉంగరాన్ని లాగేందుకు దొంగలు యత్నించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆమె చేతిని వెనక్కి లాగేశారు. సభలకు హాజరయ్యే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.