గుంటూరు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీనేత వైఎస్ షర్మిల. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆమె బస్సుయాత్రను ప్రారంభించారు. సీఎం అంటే అధికారం అనుభవించడమే కాదని ప్రజలకు సేవ చేయడమే తన ధర్మం అనుకోవాలని చెప్పారు. 

చంద్రబాబులా తాను ఏది చేయాలని అనుకుంటే అదే చేస్తాను అనుకోవడం దుర్మార్గమన్నారు. అధికారమే ముఖ్యం అనుకుంటే చంద్రబాబులా వైఎస్ జగన్ కూడా అబద్దాలు చెప్పేవారు కాదా అని నిలదీశారు. 

జగన్ వల్ల రైతులకు మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇచ్చిన మాట తప్పని వ్యక్తి, అబద్దాలు చెప్పని వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమేనన్నారు. చంద్రబాబుకు తన కొడు మేలు తప్ప ప్రజల మేలు అక్కరలేదని ఆరోపించారు వైఎస్ షర్మిల. 

తొలుత రాజధాని ప్రాంతంలో భూముల కోల్పోయిన బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. ల్యాండ్‌ పూలింగ్‌, రిజర్వ్‌ జోన్‌, స్పిడ్‌ యాక్సెస్‌ రోడ్‌ వల్ల భూములు కోల్పోయిన బాధితులు వైఎస్‌ షర్మిలకు తమ కష్టాలను చెప్పుకొచ్చారు. 

రాజధాని పేరుతో తమ భూములను దోచుకోని టీడీపీ ప్రభుత్వం తమ బతుకులను నాశనం చేసిందని బోరున విలపించారు. రాజధాని నిర్మిస్తే తమకు లాభం జరుగుతుందని భావించామని, కానీ దానితోనే తమకు కష్టాలకు ప్రారంభమయ్యాయని షర్మిల వద్ద వాపోయారు.

పుష్కరాల పేరుతో ఇళ్లు కూడా తీసేయడంతో వేలమంది వీధులపాలయ్యామని కన్నీరుమున్నీరయ్యారు. పుష్కరాల అనంతరం ఇళ్లు కట్టిస్తామని స్లిప్పులు ఇచ్చారని, కానీ ఇంతవరకు ఊసేలేదని బాధిత మహిళలు వాపోయారు. 

కరకట్ట మీద ఉన్న ఇళ్లని పూర్తిగా తొలగించారని, వైఎస్‌ జగన్‌ సీఎం అయితేనే తమకు న్యాయం జరుగుతుందని ప్రజలు షర్మిలతో చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకిృష్ణారెడ్డి, వైసీపీ ఎంపీ అభ్యర్థి మోదుగులు వేణుగోపాల్‌ రెడ్డి, ఎంపీ బుట్టా రేణుకలు బాధితులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.  

ఈ వార్తలు కూడా చదవండి

టార్గెట్ లోకేష్: మంగళగిరిలో షర్మిల బస్ యాత్ర