Asianet News TeluguAsianet News Telugu

చింతమనేనికి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పండి: వైఎస్ షర్మిల

మహిళలపై గౌరవం లేని చింతమనేనిలాంటి దుర్మార్గుడికి మళ్లీ ఎమ్మెల్యే సీటిచ్చిన చంద్రబాబు ఇంకెంత దుర్మార్గుడో ఆలోచించుకోవాలని షర్మిల స్పష్టం చేశారు. దెందులూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొటారు అబ్బయ్యచౌదరికి మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

ys sharmila fires on chinthamaneni prabhakar
Author
Denduluru, First Published Apr 3, 2019, 4:25 PM IST

నగరి : మహిళలకు అండగా నిలిచే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వైసీపీ నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి రోజా స్పష్టం చేశారు. నగరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రోజా నియోజకవర్గంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా తన ఇంటి తలుపు తట్టవచ్చని స్పష్టం చేశారు. 

ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటానని తన వంతు సాయం చేస్తానని ఆమె భరోసా ఇచ్చారు. నాలుగున్నర ఏళ్లు మహిళలను మోసం చేసిన చంద్రబాబును ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. 

పసుపు కుంకుమ పేరిట ఇచ్చే తాయిలాలకు ఎవరూ మోసపోవద్దని సూచించారు. మన భవిష్యత్‌ బాగుండాలంటే మహిళా సాధికారత సాధ్యం కావాలంటే జగనన్నను సీఎం అయితేనే సాధ్యమన్నారు. 

వైసీపీకి అధికారం అప్పగిస్తే నాలుగు దఫాలుగా డ్వాక్రా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. వడ్డీలేని రుణాలు అందించి ఆదుకుంటామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు నాలుగు దఫాలుగా రూ.75 వేలు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. 

పిల్లల్ని చదివించే తల్లులకు సంవత్సరానికి రూ.15వేలు వారి ఖాతాల్లోనే జమ చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి లక్ష నుంచి రూ.5 లక్షల వరకు లబ్ధి చేకూరేవిధంగా నవరత్నాలు పథకాలు రూపొందింంచామని తెలిపారు రోజా. 

3. చింతమనేనికి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పండి: వైఎస్ షర్మిల 

దెందులూరు: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ఇసుక తనిఖీలకు వెళ్లిన మహిళా ఎమ్మార్వో వనజాక్షిని జుట్టు పట్టుకొని రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లిన చింతమనేని ప్రభాకర్‌ అసలు మనిషేనా అంటూ విరుచుకుపడ్డారు. 

మహిళలపై గౌరవం లేని చింతమనేనిలాంటి దుర్మార్గుడికి మళ్లీ ఎమ్మెల్యే సీటిచ్చిన చంద్రబాబు ఇంకెంత దుర్మార్గుడో ఆలోచించుకోవాలని షర్మిల స్పష్టం చేశారు. దెందులూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొటారు అబ్బయ్యచౌదరికి మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

చింతమనేని బెదిరింపులకి భయపడవద్దన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో చింతమనేనికి గట్టి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఒక సీఎం ఎలాంటి ద్రోహం చేయకూడదో అంతకంటే ఘోరమైన ద్రోహాలు చేశారంటూ విరుచుకుపడ్డారు. 

రైతు రుణమాఫీ అంటూ చేసిన మొదటి సంతకానికే దిక్కులేకుండా పోయిందని, డ్వాక్రామహిళలకు రుణమాఫీ చేస్తానన్న హామీని అసలు పట్టించుకోలేదన్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదన్నారు. 

ఐదేళ్లు మహిళలకు ఏమి చేయకుండా పసుపు కుంకుమ అంటూ భిక్షం వేస్తున్నట్లు ఇస్తున్నారని ఎంగిలి చేయి విదిలిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. పసుపు కుంకుమకు అక్కా చెల్లెల్ళు మోసపోవద్దని హితవు పలికారు. ఇదంతా ఎన్నికల జిమ్మిక్కు మాత్రమేనని మరోసారి చంద్రబాబు చేతుల్లో మోసపోకండన్నారు. 

ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ ఆస్పత్రులను తీసేశారని ఆరోపించారు. చంద్రబాబు  కుటుంబ సభ్యులు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేసుకోవచ్చు గానీ సామాన్యులు మాత్రం చేయించుకోకూడదా అంటూ నిలదీశారు.  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదన్నారు. 

రూ.15వేల కోట్లు ఉన్న పోలవరం ప్రాజెక్టును 60వేలకోట్లకు పెంచారని మూడేళ్లలో పూర్తి చేస్తానని ఇప్పటి వరకు పూర్తి చెయ్యలేదంటూ విరుచుకుపడ్డారు. అమరావతిలో ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ అయినా కట్టారా అంటూ నిలదీశారు. కేంద్రం రూ.2,500 కోట్లు ఇస్తే ఒక్కబిల్డింగ్ కూడా కట్టలేదన్నారు. 

అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజుపెడతానన్నాట అన్న చందంగా అమరావతిలో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కట్టలేదు కానీ ఇంకో ఐదేళ్లలో అమెరికా చేసేస్తారట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు వస్తే జాబు వస్తుందన్న చంద్రబాబు ఎవరికి జాబిచ్చారో చెప్పాలని నిలదీశారు. 

కేవలం చంద్రబాబు తనయుడు లోకేష్‌కు మాత్రమే జాబు వచ్చిందన్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు. అఆలు రావు గానీ అగ్ర తాంబూలం నాకే కావాలన్నాడట ఎవరో పప్పు తీరు కూడా అలాగే ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios