Asianet News TeluguAsianet News Telugu

ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జగన్ ప్రమాణ స్వీకారం...ముహూర్తం ఇదే

రెండురోజులపాటు వైయస్ జగన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి వేదిక కోసం అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేషన్ సభ్యులు పలు వేదికలను పరిశీలించారు. చివరకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంను ప్రభుత్వంతోపాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఎంపిక చేశారు. 
 
ys jaganmohan reddy swearing ceremony at indhiragandhi muncipal stadium
Author
Amaravathi, First Published May 25, 2019, 2:53 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జగన్ ప్రమాణ స్వీకారానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్, ఇతర విషయాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వేదికను నిర్ణయించారు. 
రెండురోజులపాటు వైయస్ జగన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి వేదిక కోసం అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేషన్ సభ్యులు పలు వేదికలను పరిశీలించారు. చివరకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంను ప్రభుత్వంతోపాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఎంపిక చేశారు. 

ఈనెల 30న ఉదయం 11.40 నిమిషాలకు వైయస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఒకే కావడంతో ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. 

వైయస్ జగన్ ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తోపాటు తెలంగాణ సీఎం కేసీఆర్, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రలు సైతం హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

ఇప్పటికే ఇందిరాగాంధీ స్టేడియంను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విజయవాడ నగరంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులు ను చీఫ్ సెక్రటరీ య యల్ వి సుబ్రమణ్యం ఆదేశించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios