ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు కోసం వైఎస్సార్‌సిపి విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తో పాటు ఆయన కుటుంబసభ్యులందరు ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే శనివారం వీరందరు ఎన్నికల ప్రచారానికి విరామం ప్రకటించారు. తెలుగు సంవత్సరాది ఉగాది పండగను ఇంట్లోనే జరుపుకోవాలని భావించిన జగన్ కుటుంబం ఈ నిర్ణయం తీసుకుంది. 

తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని జగన్ అమరావతిలోని తన నివాసంలోనే గడపనున్నారు. తన కుటుంబంతో కలిసి ఉగాది వేడుకలను జరుపుకోనున్నారు. అంతేకాకుండా పార్టీ తరపున నిర్వహించే పంచాంగ శ్రవణంలో పాల్గొననున్నారు. 

అయితే సాయంత్రం సమయంలో పార్టీకి సంబంధించిన కొన్ని కీలక కార్యక్రమాల్లో మాత్రం జగన్ పాల్గొంటారని తెలుస్తోంది. విజయవాడలోని పార్టీ ఆఫీస్‌లో వైఎస్సార్‌సిపి ఎన్నికల మేనిఫెస్టోను ఆయన విడుదల చేయనున్నారు. అలాగే మరికొన్ని కీలక కార్యక్రమాల్లో మాత్రమే జగన్ పాల్గొననున్నారు. కానీ ప్రచార కార్యక్రమాలకు మాత్రం దూరంగా వుండనున్నారు. 

జగన్‌తో పాటు ఆయన భార్య భారతి, సోదరి షర్మిల, తల్లి విజయలక్ష్మీ కూడా ప్రచారానికి విరామం ప్రకటించారు. గతకొద్ది రోజులుగా విరామం లేకుండా వైసిపి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తూ వీరంతా బిజీబబిజీగా గడుపుతున్నారు.