అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నుంచి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని తన నివాసంలో నూతన ఎమ్మెల్యేలతో జగన్ భేటీ అయ్యారు. 

ఈనెల 25 ఉదయం 10.30 గంటలకు శాసన సభాపక్ష సమావేశం ఉన్న నేపథ్యంలో అందుకు సంబంధించి జగన్ వారికి పలు సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే శనివారం లేజిస్టేటివ్ సమావేశం అనంతరం ఆయన హైదరాబాద్ పయనం కానున్నారు. 

హైదరాబాద్ లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ అయిన నరసింహన్ ను కలవనున్నారు వైయస్ జగన్. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే అంశంపై చర్చించనున్నారు. ఇకపోతే ఈనెల 30న విజయవాడలో వైయస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.