కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సినీ ఇండస్ట్రీ నుంచి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు వైసీపీ గూటికి చేరారు. అంతేకాదు పలువురు రాజకీయాల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 

తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి యువ హీరో తనీష్ చేరారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయంలో వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. తనీష్ కు పార్టీ కండువాకప్పి వైఎస్‌ జగన్‌ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 

వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం ఆనందంగా ఉందని హీరో తనీష్ అన్నారు. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. మరోవైపు అనంతపురం జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జీవానందరెడ్డి కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి  చేరారు. వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వైఎస్ జగన్ పార్టీ కండువా కప్ప సాదరంగా ఆహ్వానించారు.