కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారానికి రాకూడదని సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకను ఎమ్మెల్యే అభ్యర్ధి చెన్న కేశవరెడ్డి స్పష్టం చేశారు. వీరిద్దరి మధ్య నెలకొన్న విభేదాలు బహిర్గతమయ్యాయి.

కర్నూల్: కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారానికి రాకూడదని సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకను ఎమ్మెల్యే అభ్యర్ధి చెన్న కేశవరెడ్డి స్పష్టం చేశారు. వీరిద్దరి మధ్య నెలకొన్న విభేదాలు బహిర్గతమయ్యాయి.

కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో చేనేత వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉంటారు. అదే సామాజిక వర్గానికి చెందిన బుట్టా రేణుక ఇదే నియోజకవర్గంలో ప్రచారం చేయడం ద్వారా వైసీపీ ప్రయోజనం కలుగుతోందని ఆ పార్టీ నాయకత్వం భావించింది.

రెండు రోజుల క్రితం చేనేత, బీసీ కులాల ఆత్మీయ సమావేశంలో కర్నూల్ ఎంపీ స్థానం నుండి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్ధి డాక్టర్ సంజీవ్ కుమార్, ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డిలు హాజరయ్యారు.

ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్ధి సంజీవ కుమార్ మాట్లాడుతుండగా ఎంపీ బుట్టా రేణుకను ఈ సమావేశానికి ఎందుకు రాలేదో చెప్పాలని ప్రశ్నించారు. బుట్టా రేణుక ఎంపీగా విజయం సాధించిన తర్వాత ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్క పైసా కూడ ఖర్చు చేయలేదని చెప్పారు.

నాగులదిన్నె గ్రామానికి దత్తత తీసుకొని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని ఎదురుదాడికి దిగారు.దీంతో ఆమె వర్గీయులు అసంతృప్తిని వ్యక్తం చేశారు.ఎమ్మిగనూరులో బుట్టా రేణుక ప్రత్యామ్నాయ నేతగా ఎదిగే అవకాశం ఉందని భావించి ఆమెను అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆమె వర్గీయులు అభిప్రాయంతో ఉన్నారు.