Asianet News TeluguAsianet News Telugu

ఫలితాలపై జగన్ ధీమా: లోటస్ పాండ్ నుంచి అమరావతికి షిఫ్ట్

రాష్ట్ర శానససభకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని జగన్ పూర్తి విశ్వాసంతో ఉండడం వల్లనే కార్యాలయాన్ని హైదరాబాదు నుంచి అమరావతికి తరలిస్తున్నట్లు చెబుతున్నారు.

YCP office to be shifted to Amaravati from Hyderabad
Author
Hyderabad, First Published May 13, 2019, 12:29 PM IST

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలపై పూర్తి విశ్వాసంతో ఉన్న వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో అమరావతికి తరలిపోవడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా అమరావతికి తరలిస్తున్నారు. 

హైదరాబాదులోని లోటస్ పాండులో గల పార్టీ సామగ్రిని అమరావతికి తరలించడం ప్రారంభమైంది. ఈ నెల 21వ తేదీ నుంచి వైసిపి కేంద్ర కార్యాలయం అమరావతి నుంచే కార్యకలాపాలు నిర్వహించనుంది. జగన్ మాత్రం 22వ తేదీన ఉండవల్లి వెళ్తారు. ఆయన 22వ తేదీన ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

రాష్ట్ర శానససభకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని జగన్ పూర్తి విశ్వాసంతో ఉండడం వల్లనే కార్యాలయాన్ని హైదరాబాదు నుంచి అమరావతికి తరలిస్తున్నట్లు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios