ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు నేడు ఫలితాలు వెలువడనున్నాయి. గురువారం ఉదయం 8గంటలకు ఫలితాల లెక్కింపు ప్రారంభం అయ్యింది. కాగా... చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో రోజా దూసుకుపోతున్నారు. తొలి రౌండ్ లో రోజా ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు 2606ఓట్ల ఆధిక్యంలో రోజా ఉన్నారు. టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ వెనకంజలో ఉన్నారు. టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడి కొడుకే భాను ప్రకాశ్. గత ఎన్నికల్లో రోజా చేతిలో గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఓడిపోయాడు. ఈ ఎన్నికల్లో ఆయన కుమారుడు రోజా చేతిలో ఓటమి పాలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు లోకసభతో పాటు ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్రంలోని 175 స్థానాలకు పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన మధ్య రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరిగింది. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతోంది.