టీడీపీ నేత జలీల్ ఖాన్ పై వైసీపీ నేతలు విజయవాడ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఏపీలో ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ పోలింగ్ సమయంలో జలీల్ ఖాన్ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా దాడి చేశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

శుక్రవారం వైసీపీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులు విజయవాడ కమిషనర్ ని కలిసి జలీల్ ఖాన్ పై ఫిర్యాదు చేశారు. సమావేశం అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.

టమి భయంతోనే జలీల్‌ఖాన్‌ ప్రజలను మభ్యపెట్టాలని చూశారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌పై దాడికి పాల్పడిన జలీల్‌ఖాన్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా సీపీని కోరినట్టు తెలిపారు. దాడికి పాల్పడ్డ జలీల్‌ఖాన్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

మల్లాది విష్ణు మాట్లాడుతూ.. జలీల్‌ఖాన్‌ ప్రవర్తిస్తున్న తీరు అప్రజాస్వామికంగా ఉందని తెలిపారు. టీడీపీ నాయకులు రౌడీల మాదిరి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపినట్టు వెల్లడించారు.