ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. దీంతో.. పార్టీ నేతలంతా ఎన్నికల ప్రచార జోరు పెంచారు. ప్రధాన అభ్యర్థులు నియోజకవర్గంలోని కీలక ప్రాంతాల్లో ప్రచారాలు నిర్వహిస్తుంటే... వారి మద్దతుదారుల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కాగా.. అలా ఎన్నికల ప్రచారంలో ఓ వైసీపీ నేత చేసిన పొరపాటు ఇప్పడుు చర్చనీయాంశం అయ్యింది.

ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వైసీపీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి అనటంతో వేదికపై ఉన్న వారందరూ ఖంగుతిన్నారు. విశాఖ మద్దిలపాలెం నగర పార్టీ కార్యాలయంలో ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైకిల్‌ గుర్తుకు ఓటెయాలని పేర్కొన్నారు. వేదిక మీద ఉన్న వారు అప్రమత్తం చేయటంతో ఆయన వెంటనే సర్దుకొని ఫ్యాన్‌ గుర్తుకు ఓటువేయాలని చెప్పారు.